
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రన్ హెట్‌మైర్ దుమ్మురేపుతున్నాడు. అటు బ్యాటింగ్ ఇటు ఫీల్డింగ్‌లో సత్తా చాటుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫినిషర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌లో విలువైన పరుగులు చేసిన హెట్‌మైర్.. తర్వాత కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మైమరిపించాడు.
అతని సూపర్ ఫీల్డింగ్‌కు సునీల్ నరైన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే నరైన్ రనౌటయ్యాడు. భారీ లక్ష్యచేధనలో భాగంగా పవర్ ప్లేలో ధాటిగా ఆడాలనే ఉద్దేశంతో కేకేఆర్.. వ్యూహాత్మకంగా నరైన్‌ను ఓపెనర్‌గా పంపించగా.. హెట్‌మైర్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్.. కవర్స్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. హెట్‌మైర్ సూపర్ ఫీల్డింగ్‌తో దెబ్బకొట్టాడు. అతను విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకడంతో నరైన్ పెవిలియన్ చేరాడు. దాంతో కేకేఆర్ వ్యూహం బెడిసికొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) మరో శతకంతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ముందు 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్ శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.