For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KKR: వారెవ్వా వాటే ఫిట్‌నెస్.. నాలుగు పరుగులు తీసిన పడిక్కల్, బట్లర్! (వీడియో)

RR vs KKR: Jos Buttler And Devdutt Padikkal Takes 4 Runs By Running

ముంబై: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ అరుదైన ఫీట్ సాధించారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ ద్వయం ఏకంగా నాలుగు పరుగులు తీసింది. వికెట్ల మధ్య పరుగెత్తుతూ నాలుగు పరుగులు తీయడం అత్యంత అరుదు. సహజంగా ఓవర్ త్రో కారణంగా ఇలాంటి పరుగులు వస్తాయి. కానీ ఈ మ్యాచ్‌లో బట్లర్, దేవదత్ పడిక్కల్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి నాలుగు పరుగులు తీసారు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపుతూ కేకేఆర్ ఫీల్డర్ వెంకటేశ్ అయ్యర్ పడ్డ కష్టానికి విలువ లేకుండా చేశారు.

టాస్ ఓడి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగగా.. ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని బట్లర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతి బౌండరీ లైన్‌ను సమీపిస్తుండగా వెంకటేశ్ అయ్యర్ ఫుల్ లెంగ్త్ డైవ్‌తో అద్భుతంగా ఆపాడు. అతనికి బ్యాకప్‌గా వచ్చిన మరో ఫీల్డర్ బంతిని అందుకొని కేకేఆర్ కీపర్ షెల్డన్ జాక్సన్‌కు వేయగా.. అప్పటికే బట్లర్ నాలుగో పరుగును పూర్తి చేశాడు.

నాలుగో పరుగు కోసం రిస్కీ చేసిన బట్లర్.. తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫుల్ లెంగ్త్ డైవ్‌తో బయటపడ్డాడు. త్రో కూడా బలహీనంగా ఉండటంతో అతను బచాయించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పడిక్కల్, బట్లర్ ఫిట్‌నెస్ లెవల్స్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌‌లో రాజస్థాన్ 7 పరుగులతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్‌కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 19, 2022, 7:23 [IST]
Other articles published on Apr 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+