Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs KKR: ఇదేందయ్యా ఇది.. ఏడ చూడలే! (వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇచ్చిన హై క్యాచ్‌ను డికాక్ తెలివిగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అతను హెల్మెట్ తీసి అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వరుణ్ చక్రవర్తీ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ ఐదో బంతిని వరుణ్ చక్రవర్తీ గంటకు 113 కిలోమీటర్ల వేగంతో వేయగా.. రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఈ క్యాచ్‌ను డికాక్.. హెల్మెట్ తీసి సునాయసంగా అందుకున్నాడు. బంతి బాగా హైట్ వెళ్లడంతో డికాక్‌కు కావాల్సిన సమయం దొరికింది.

RR vs KKR IPL 2025 Fans hail Quinton de Kock after takes Stunning High Catch

హెల్మెట్ గ్రిల్.. బంతిపై ఫోకస్‌ను తగ్గిస్తుందని భావించిన డికాక్.. తెలివిగా వ్యవహరించి బంతిని అందుకున్నాడు. అతని తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డికాక్ సమయస్ఫూర్తి అమోఘం అంటూ కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ క్యాచ్‌ను విచిత్రంగా చూస్తున్నారు. 'ఇదేందయ్యా ఇది.. ఏడ చూడలే'అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 33), యశస్వి జైస్వాల్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/17), మోయిన్ అలీ(2/23), హర్షిత్ రాణా(2/36), వైభవ్ అరోరా(2/33) రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, March 26, 2025, 22:14 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+