
1.కొంపముంచి కేకేఆర్ బ్యాటర్ల అత్యుత్సాహం..
218 పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు సరైన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతో ఓపెనర్‌గా పంపించిన సునీల్ నరైన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. ఫించ్ అనాలోచిన రన్ కారణంగా నరైన్ బలయ్యాడు. నరైన్ ఓ 6 బంతులాడిన వీలైనన్ని పరుగులు రాబట్టేవాడు. అయితే ఫించ్, అయ్యర్ ఆ లోటును తీర్చారు. ఇద్దరూ మంచి భాగస్వామ్యంతో దూసుకెళ్లారు. కానీ కీలక సమయంలో ఔటవ్వడం జట్టు ఓటమిని శాసించింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఇన్నింగ్స్ ముగిసేవరకు ఉన్నా కేకేఆర్ గెలిచేది. ముఖ్యంగా చాహల్ ఓవర్లో భారీ షాట్లు ఆడాలనే ఆతృత టీమ్‌కు తీవ్రని నష్టం చేసింది. ఈ ఓవర్‌ను ఓపికగా ఆడి వికెట్లు కోల్పోకుండా జాగ్రత్త పడితే ఫలితం మరోలా ఉండేది.

2.బిగ్ హిట్టర్ల వైఫల్యం..
భారీ లక్ష్యచేధనలో బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇష్టానుసారం మార్చడం కూడా ఆ జట్టు వైఫల్యానికి కారణమైంది. నరైన్ ఓపెనర్‌గా పంపించడం, వెంకటేశ్ అయ్యర్ 6వ స్థానంలో పంపించడం, కమిన్స్ కన్నా ముందు శివం మావి బ్యాటింగ్ రావడం వంటివి జట్టుకు తీరని నష్టం చేసాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై బిగ్ హిట్టర్లు ఆండ్రీ రస్సెల్(0), ప్యాట్ కమిన్స్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం జట్టు ఓటమిని శాసించింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలుచున్నా.. ఫలితం కేకేఆర్‌కు అనుకూలంగా ఉండేది.

3. వికెట్ల మధ్య పరుగులు తీయకపోవడం..
బ్రాబౌర్న్ మైదాన పరిస్థితులకు తగ్గట్లు కేకేఆర్ బ్యాటర్లు ఆడకపోవడం కూడా ఓటమికి కారణమైంది. ఈ మైదానంలో ఓవైపు బౌండరీ చిన్నగా ఉంటే మరోవైపు పెద్దగా ఉంటుంది. దాంతో చిన్నగా ఉన్నవైపు బ్యాటర్లంతా భారీ షాట్లు ఆడుతుంటారు. అయితే ఇక్కడ కేకేఆర్ బ్యాటర్లు పెద్ద బౌండరీ ఆడినప్పుడు క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయలేకపోయారు. కానీ రాజస్థాన్ బ్యాటర్లు మాత్రం వికెట్ల మధ్య అద్భుతంగా పరుగెత్తారు. వారు ఏకంగా 4 పరుగులు తీసారు. ఇలా కేకేఆర్ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తే మెరుగైన రన్ రేట్ ఉండేది. అప్పుడు బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడేవారు.

4. చెత్త బౌలింగ్..
ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ మినహా కేకేఆర్ బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తీ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు తీవ్రని నష్టం చేస్తోంది. ప్రతీ మ్యాచ్‌లో రాణించిన ఉమేశ్ యాదవ్ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసాడు. పవర్ ప్లేలో కనీసం ఒక్క వికెట్ అయినా తీసే అతను ఈ మ్యాచ్‌లో ఆ జోరు చూపించలేకపోయాడు. జోస్ బట్లర్ ఔట్ చేస్తే కేకేఆర్‌కు ఈ గతే పట్టేది కాదు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే చెప్పాడు.

5. కెప్టెన్సీ వైఫల్యం..
ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌గా కెప్టెన్‌గా విఫలమయ్యాడు. జోస్ బట్లర్ విధ్వంసంతో అతను ఏం చేయలేకపోయాడు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ మార్పుల్లో స్పాట్ ఆన్ డిసిషన్స్ తీసుకోలేదు. ముఖ్యంగా జోస్ బట్లర్‌కు కళ్లెం వేయలేకపోయాడు.


Click it and Unblock the Notifications
