Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs GT: అంపైర్‌తో శుభ్‌మన్ గిల్ వాగ్వాదం! (వీడియో)

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహనం కోల్పోయాడు. అంపైర్ల ద్వంద వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయంపై శుభ్‌మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్‌లో వైడ్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్లు పలుమార్లు అంపైర్ సమీక్షకు వెళ్లారు. ఈ వైడ్స్ విషయంలో థర్డ్ అంపైర్ తడబడ్డాడు. ముందు వైడ్ అని, తర్వాత కాదని అయోమయానికి గురి చేశాడు.

RR vs GT Shubman Gill loses cool shouts at the umpire over last-minute change wide call

ఈ ఓవర్ చివరి బంతిని మోహిత్ శర్మ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా.. అంపైర్ వైడ్ ఇచ్చాడు. సంజూ శాంసన్ ముందుకు జరగడంతో వైడ్ కాదని గిల్ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ కూడా సంజూ శాంసన్ పొజిషన్‌ను ప్రస్తావిస్తూ ఫెయిర్ డెలివరీని ప్రకటించాడు. ఆ వెంటనే తన మాటను సరిదిద్దుకొని వైడ్ బాల్ అని తెలిపాడు.

దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గిల్.. ఫీల్డ్ అంపైర్లను నిలదీసాడు. గట్టిగా అరుస్తూ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేసినా.. గిల్ వినిపించుకోలేదు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో అంపైర్లు వైడ్స్ విషయంలో తీవ్రంగా తడబడుతున్నారు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోలా తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా థర్డ్ అంపైర్స్ తమ నిర్ణయాల్లో నిలకడ చూపించడం లేదు. బ్యాట్స్‌మెన్ మూవ్ అయినప్పుడు వైడ్ కాదని ఒక మ్యాచ్‌లో ప్రకటిస్తే.. మరో మ్యాచ్‌లో అలాంటి బంతినే వైడ్‌గా ఇస్తున్నారు.

థర్డ్ అంపైర్ల తీరుపై కామెంటేటర్స్, ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 ), సంజూ శాంసన్(38 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, April 10, 2024, 22:32 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+