For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs GT: వారి వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సంజూ శాంసన్

గుజరాత్ టైటాన్స్ అద్భుత బ్యాటింగ్‌తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్‌తో గుజరాత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇదే తొలి పరాజయం కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించేందుకు సంజూ శాంసన్ నిరాకరించాడు.

sanju Samson

ఆఖరి బంతికే ఓటమిపాలయ్యామని చెబుతూ నవ్వులు పూయించాడు. ఈ టోర్నీలోనే కెప్టెన్లంతా కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే అది ఓటమికి గల కారణాలు చెప్పడమేనని అసహనం వ్యక్తం చేశాడు.

'చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం(నవ్వుతూ). నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఈ లీగ్‌లో కెప్టెన్లంతా కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే అది ఓటమి తర్వాత అందుకు గల కారణాలు గురించి చెప్పడమే. అది చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని గంటల తర్వాత ఓటమికి గల కారణాలను చెప్పగలను.

అయితే ఈ గెలుపు క్రెడిట్ మాత్రం గుజరాత్ టైటాన్స్‌దే. వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. ఈ ఓటమి నుంచి మేం గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు 180 పరుగులు కూడా పోరాడే లక్ష్యమని భావించాను.

వాస్తవానికి మేం చేసిన 197 రన్స్ గెలవాల్సిన లక్ష్యం. ఏ మాత్రం తేమ లేకుండా స్లోగా.. డ్రైగా ఉన్న ఈ పిచ్‌పై ఈ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. మా‌ బౌలింగ్ యూనిట్ సామర్థ్యాల ప్రకారం ఈ లక్ష్యాన్ని మేం డిఫెండ్ చేసుకోవాల్సింది. కానీ గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.

మా ఇన్నింగ్స్ ఆరంభంలో ఈ వికెట్‌పై బ్యాటింగ్ చాలా కష్టంగా అనిపించింది. కానీ మేం అద్భుతంగా ఆడి 197 పరుగులు చేశాం. జైపూర్ వేదికగా 197 పరుగులను ఎప్పుడైనా కాపాడుకోవాల్సిన స్కోర్'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 11, 2024, 0:54 [IST]
Other articles published on Apr 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+