ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రియాన్ పరాగ్(48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 ), సంజూ శాంసన్(38 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది.గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.
మెరుపు ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. కానీ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అతను కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే జోస్ బట్లర్(8)ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్లకు 43 పరుగులు చేసింది.

చెలరేగిన పరాగ్, సంజూ శాంసన్..
ఈ పరిస్థితుల్లో సంజూ శాంసన్, రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జోడీ అనంతరం ధాటిగా ఆడింది. వరుస బౌండరీలతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. రియాన్ పరాగ్ భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం సంజూ శాంసన్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రియాన్ పరాగ్ భారీ షాట్లతో విరుచుకుపడగా..అతని జోరుకు మోహిత్ శర్మ బ్రేక్ వేసాడు. పరాగ్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై విజయ్ శంకర్ అద్భుతంగా అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను సమయస్పూర్తితో బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 130 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మైర్ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఆఖరి ఓవర్‌లో సంజూ శాంసన్, హెట్‌మైర్ చెరో సిక్సర్ బాదడంతో రాజస్థాన్ రాయల్స్ 196 పరుగులు చేయగలిగింది.