Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs DC: 6 బంతుల్లో 5 ఫోర్లు.. యశస్వీ నయా రికార్డు!

గువహతి: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే(4,4,4,0, 4, 4) ఐదు బౌండరీలు బాదాడు.

వరుసగా మూడు బౌండరీలు కొట్టిన యశస్వి జైస్వాల్.. నాలుగో బంతిని డాట్ చేసి మరో రెండు బౌండరీలు బాదాడు. దాంతో తొలి ఓవర్‌లోనే 20 పరుగులు ఇచ్చాయి. ఈ సీజన్‌లో ఫస్ట్ ఓవర్‌లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం. తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు నమోదు చేశాడు.

Yashasvi Jaiswal

జైస్వాల్ ధాటికి ఖలీల్ అహ్మద్ తన లెంగ్త్‌ను మార్చుకున్నా.. ఫీల్ట్ సెటప్ తగ్గట్లు బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం జైస్వాల్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగుతుండటంతో రాజస్థాన్ రాయల్స్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను ధాటింది. ఇరు జట్లు స్వల్ప మార్పులతో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగాయి.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లపై ఢిల్లీ క్యాపిటల్స్ వేటు వేసింది. మనీశ్ పాండే, లలిత్ యాదవ్‌లకు అవకాశం కల్పించింది. మిచెల్ మార్ష్ స్వదేశానికి పయనం కాగా.. అతనిస్థానంలో రోవ్‌మన్ పొవెల్‌ను ఆడిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి సందీప్ శర్మ వచ్చాడు.

పృథ్వీ షాను తుది జట్టు నుంచి తప్పించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో అతన్ని చేర్చింది. బ్యాటింగ్ సమయంలో అతను ఇంపాక్ట్ ప్లేయర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. పేలవ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారణమైన దేవదత్ పడిక్కల్‌పై కూడా ఆ జట్టు వేటు వేసింది.

Story first published: Saturday, April 8, 2023, 16:14 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+