For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. చూస్తే వావ్ అంటూ నోరెళ్లబెట్టాల్సిందే (వీడియో)!

 RR vs DC: Sanju Samson Takes a Brilliant One-Handed Catch to Send Shikhar Dhawan
IPL 2021,RR vs DC: Sanju Samson Brilliant Flying Catch చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!! || Oneindia

ముంబై: రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ సంజూ శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. స్పైడర్ మ్యాన్‌లా గాల్లో తేలుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సంజూ వికెట్ల వెనుకాల తన సూపర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు బిత్తరపోయిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. సంజూ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్ సైతం అవాక్కయ్యారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడారు.

ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతిని జయదేవ్ ఉనాద్కత్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌గా వేయగా.. శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకెళ్లగా.. కీపర్ సంజూ శాంసన్ స్పైడర్ మ్యాన్‌లా గాల్లో తేలుతు బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. శాంసన్ వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పక్షివా? సూపర్ మ్యాన్‌వా? అంటూ కామెంట్ చేస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన క్రిస్ మోరీస్(18 బంతుల్లో 4 సిక్స్‌లతో 36 నాటౌట్) ధనాధన్ హిట్టింగ్‌తో 3 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ ఐపీఎల్ 2021 సీజన్‌లో బోణీ కొట్టింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(32 బంతుల్లో 9 ఫోర్లతో 52)మినహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనాద్కత్ మూడు, ముస్తాఫిజుర్ రెండు, మోరిస్ ఓ వికెట్ తీశారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసిన రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. డేవిడ్ మిల్లర్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు, రబడా, క్రిస్ వోక్స్ రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Friday, April 16, 2021, 0:03 [IST]
Other articles published on Apr 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+