
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ డ్రైగా ఉండటంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. పిచ్ కండీషన్స్ కారణంగానే జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పాడు. రిపల్ పటేల్ స్థానంలో లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్ ప్లేస్‌లో చేతన్ సకారియా జట్టులోకి వచ్చారని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లను కాపాడుకోని, అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించవచ్చని చెప్పాడు.
టాస్ ఓడటాన్ని తాము పెద్దగా పట్టించుకోవడం లేదని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ అన్నాడు. పెటర్నిటీ లీవ్ తీసుకున్న షిమ్రాన్ హెట్‌మైర్ స్థానంలో రాసీ వాన్ డెర్ డస్సెన్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. తాము ఇప్పటివరకు గుడ్ క్రికెట్ ఆడామని, దాన్నే కొనసాగిస్తామని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. 16 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్‌తో సమవుజ్జీగా నిలుస్తుంది. ఆ సెకెండ్ స్లాట్ పింక్ టీమ్ వశం అవుతుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ కేపిటల్స్ గనక గెలిస్తే- రాజస్థాన్ రాయల్స్ ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.
ఢిల్లీ ఖాతాలో 12 పాయింట్లు చేరుతాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాజస్థాన్ రాయల్స్ అడ్డు కొంతమేర తొలగినట్టవుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. రాజస్థాన్ గెలిచినా కూడా ఆర్సీబీకి మాత్రం బెనిఫిట్ అవుతుంది. ఢిల్లీ అడ్డు ఉండదు కాబట్టి అది రాయల్ ఛాలెంజర్స్‌కు కలిసి వస్తుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరే అవకాశాలు ఉంటాయి.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్, కీపర్), దేవదత్ పడిక్కల్, రాసీ వాన్ డెర్ డస్సెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్/కీపర్), రోవ్‌మన్ పోవెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, చేతన్ సకారియా