Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs DC: ఢిల్లీకి రబడా.. రాజస్థాన్‌కు మిల్లర్... పంత్ సేనదే బ్యాటింగ్!

RR vs DC: Rabada in for Delhi, Miller repalces Stokes as Rajasthan bowl

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు డిమాండ్ మేరకే చేజింగ్‌కు మొగ్గుచూపుతున్నామని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. గత మ్యాచ్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్న సంజూ.. గాయంతో దూరమైన స్టోక్స్ స్థానంలో డేవిడ్ మిల్లర్, శ్రేయస్ గోపాల్‌ ప్లేస్‌లో జయదేవ్ ఉనాద్కత్ జట్టులోకి వచ్చారన్నాడు. ఇక టాస్ ఓడటం గెలవడం పెద్ద విషయమేమి కాదని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ అన్నాడు. షిమ్రన్ హెట్‌మైర్ స్థానంలో కగిసో రబడా జట్టులోకి రాగా.. అమిత్ మిశ్రా ప్లేస్‌లో లలిత్ యాదవ్ అవకాశం దక్కించుకున్నాడని తెలిపాడు.

తమ తొలి మ్యాచ్‌‌లోనే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. క్వారంటైన్ ముగించుకొని స్టార్ పేసర్ కగిసో రబడా జట్టులోకి రావడంతో ఆ టీమ్ బలం డబుల్ అయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే రెండు జట్లలోనూ టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉండటం, వాంఖడే బౌండరీ చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకూ ఇరు జట్లు 22 సార్లు తలపడగా చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

తుది జట్లు:

ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానే, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, టామ్ కరన్, అవేష్ ఖాన్, లలిత్ యాదవ్.

రాజస్థాన్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), డేవిడ్ మిల్లర్, శివం దూబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనాద్కత్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.

Story first published: Thursday, April 15, 2021, 20:11 [IST]
Other articles published on Apr 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+