ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఈ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటాం. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100వ మ్యాచ్ ఆడుతుండటం చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే.

ముఖ్యంగా గాయంతో తిరిగివచ్చిన తర్వాత నేనే ఆడే ప్రతీ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఇస్తాను. అయితే గాయాలు అనేవి మన చేతుల్లో లేనివి. జట్టులో రెండు మార్పులు చేశాం. ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకోలేదు. షై హోప్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ఇద్దరి స్థానాల్లో అన్రిచ్ నోర్జ్, ముఖేష్ కుమార్‌లు బరిలోకి దిగుతున్నారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకోలేదు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తెలిపాడు. డ్యూ వచ్చే అవకాశం ఉందని, ఛేజింగ్ టీమ్‌కు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాడు. గత మ్యాచ్ పిచ్‌లానే ఈ వికెట్ కూడా ఉండనుందని, తాజా వికెట్‌పై గ్రాస్ ఉంచారని తెలిపాడు.
తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్