RR vs DC: చెలరేగిన ఉనాద్కత్.. ఆదుకున్న పంత్.. రాజస్థాన్ ముందు ఈజీ టార్గెట్!

ముంబై: రాజస్థాన్ రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్ తోడవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. జయదేవ్ ఉనాద్కత్(3/15) సూపర్ స్పెల్‌కు ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/29) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఒకానొక దశలో ఢిల్లీ కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కెప్టెన్ కెప్టెన్ రిషభ్ పంత్(32 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది.
చివర్లో టామ్ కరన్(21), క్రిస్ వోక్స్(15 నాటౌట్) బౌండరీలు బాదారు. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో ఒక్క సిక్స్ కొట్టని తొలి జట్టుగా ఢిల్లీ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్, ముస్తాఫిజుర్‌కు తోడుగా క్రిస్ మోరిస్ ఓ వికెట్ తీశాడు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు రనౌటయ్యారు.

చేలరేగిన ఉనాద్కత్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి షాక్ తగిలింది. చాలా రోజుల తర్వాత పవర్ ప్లేలో బంతిని అందుకున్న రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు పృథ్వీ షా(2), శిఖర్ ధావన్(9), అజింక్యా రహానే(8)లను పెవిలియన్‌కు చేర్చాడు. తొలుత పృథ్వీ షాను క్యాచ్ ఔట్ చేసిన ఉనాద్కత్.. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ క్యాచ్ సాయంతో శిఖర్ ధావన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత రహానేను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి ఢిల్లీకి కోలుకోలేని దెబ్బ తీశాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి 3 వికెట్లకు ఢిల్లీ 36 రన్స్ చేసింది.

పంత్ హాఫ్ సెంచరీ..
ఆ వెంటనే ముస్తా ఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఢిల్లీ 37 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్‌తో కెప్టెన్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పరాగ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన పంత్.. ఉనాద్కత్ ఓవర్‌లో ఓపికపట్టాడు. ఆ తర్వాత రాహుల్ తెవాటియా వేసిన 11వ ఓవర్‌లో రెచ్చిపోయాడు. వరుసగా మూడు బౌండరీలు బాదిన పంత్.. ఆఖరి బంతికి మరో బౌండరీ బాది 20 రన్స్ పిండుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆ మరుసటి ఓవర్ ఆఖరి బంతిని కవర్స్ మీదుగా బౌండరీ తరలించిన పంత్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిదే ఫస్ట్ ఫిఫ్టీ.

రనౌట్‌తో టర్న్..
అయితే రియాన్ పరాగ్ వేసిన మరుసటి ఓవర్‌లో లేని పరుగుకు ప్రయత్నించిన పంత్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. బంతిని పిచ్‌లోనే ఆడుకోని క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. బంతిని అందకున్న పరాగ్ త్రో నేరుగా వికెట్లకు తాకడంతో పంత్ మైదానం వీడాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ వికెట్ అనంతరం ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ ఫీల్డింగ్ తోడవడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. లలిత్ యాదవ్(20), అశ్విన్(7) తీవ్రంగా నిరాశ పరిచగా.. టామ్ కరన్(21) మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్‌లో 11 రన్స్ రావడంతో ఢిల్లీ 147 పరుగులు చేయగలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications