
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఈ మ్యచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను యశస్వి అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ జోష్ హాజెల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ఇదో బంతికి సిక్స్ బాదిన యశస్వి అర్ధ శతకం పూర్తిచేశాడు.
దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2021లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అగ్రతానంలో ఉన్నాడు. పొలార్డ్ 17 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా 18 50 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అంబటి రాయుడు (20), దీపక్ హుడా (20) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

రెండో స్థానంలో
ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదడం ఇది ఐదవసారి. అయితే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసిన యశస్వి జైశ్వాల్.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ 2018లో కేకేఆర్‌పై 17 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్ సాధించాడు. మూడు, నాలుగు స్థానాల్లో దీపక్ హుడా ఉన్నాడు.
2021లో 20 బంతుల్లో రాజస్తాన్ రాయల్స్‌పై, 2015లో 22 బంతుల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై హుడా హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక కృనాల్ పాండ్యా 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసి ఐదో స్థానంలో ఉన్నాడు.
ఆ విషయంలో ధోనీకి సమీపంలో కూడా ఎవరూ లేరు.. మహీని 'కింగ్ కాంగ్' అని పిలవాలి: రవిశాస్త్రి

నాలుగో స్థానంలో
ఇక ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లలో వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన జాబితాలో యశస్వి జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై జోస్ బట్లర్ 18 బంతుల్లోనే వేగవంతమైన అర్ధ సెంచరీ బాదాడు. 2012లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఒవైస్ షా 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంజు శాంసన్ కూడా 19 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తాజాగా 19 బంతుల్లోనే యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాది ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. యశస్వి చెలరేగడంతో పవర్‌ప్లేలో రాజస్తాన్ రాయల్స్ అత్యధిక స్కోర్ (81/1) చేసింది. అంతకుముందు 2008లో డెక్కన్ చార్జెస్ (73/1)పై, 2010లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (70/0)పై పవర్‌ప్లేలో రాజస్తాన్ అత్యధిక స్కోర్ చేసింది.

పోటీపడి ఫోర్లు, సిక్స్‌లు
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు జైశ్వాల్, లూయిస్ పోటీపడి ఫోర్లు, సిక్స్‌లు దంచడంతో రాజస్థాన్ 5 ఓవర్లకే 75/0తో నిలిచింది. హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో రాయుడు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన జైశ్వాల్.. ఆపై అయిదో ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 దంచేశాడు. ఓపెనర్లిద్దరూ రెండు పరుగుల తేడాతో నిష్క్రమించినా.. పరుగుల వరద పారించలేదు. శివమ్ దూబే మరింతగా రెచ్చిపోయాడు.
మరోవైపు కెప్టెన్ శాంసన్ సహకరిస్తుండగా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. బలమైన షాట్లతో భారీ సిక్స్‌లు బాదుతూ జట్టును వడివడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 13 ఓవర్లకు స్కోరు 153/2. మిగిలిన పని పూర్తి చేయడానికి రాజస్థాన్ పెద్దగా శ్రమపడలేదు. జట్టు స్కోరు 170 వద్ద శాంసన్ ఔటైనా.. ఫిలిప్స్ (14 నాటౌట్)తో కలిసి దూబే రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు.


Click it and Unblock the Notifications












