
3 ఐసీసీ ట్రోఫీలు
కెప్టెన్ కూల్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీ.. ఎలాంటి మ్యాచ్‌నైనా మార్చేయగల కెప్టెన్సీతో అందర్నీ తనవైపు ఆకర్షించాడు. కీలక సమయంలో ఆటగాళ్లతో చర్చిస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసం పొంపొందిస్తాడు. ఏ బ్యాటర్‌కు ఎలా బంతులు వేయాలో, ఎక్కడ ఫీల్డింగ్ సెట్ చేయాలో బౌలర్లకు చెప్పి అండగా ఉంటాడు. ఉత్కంఠ మ్యాచులలో కూడా మహీ తనదైన శైలిలో మ్యాచును మలుపుతిప్పుతాడు.
ప్రత్యర్థికి ఎక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఈ క్రమంలోనే టీమిండియాకు మహీ 3 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో ప్రపంచకప్‌తో పాటు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారత క్రికెట్‌కు అందించాడు. దాంతో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా నిలిచాడు.

కింగ్ కాంగ్ అని పిలవాలి
'ఎంఎస్ ధోనీ ఎప్పటికీ అత్యంత గొప్ప వైట్ బాల్ కెప్టెన్. ఐసీసీ టోర్నీల్లో ఒకసారి అతని రికార్డు చూడండి. అసలు ధోనీ గెలవంది ఏంటో చెప్పండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లు, ఛాంపియన్ లీగ్‌లు, అన్ని ఐసీసీ టోర్నీలు, రెండు ప్రపంచ కప్‌లు మహీ గెలిచాడు. ఇదంతా అతడి కెప్టెన్సీకి ఓ ఉదాహరణ. కాబట్టి పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
ధోనీ అందరికన్నా గొప్పోడు. ధోనీని కింగ్ కాంగ్ అని పిలవాలి' అని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ధోనీ ఒక జట్టుకు నాయకత్వం వహిస్తుంటే ఒకరకమైన ప్రశాంతత, అంతా నియంత్రణలోనే ఉందనే భావన ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతున్నా సరే.. ధోనీ జట్టులో ఒక హుందాతనం కనిపిస్తుందన్నాడు.

హార్దిక్ ఫామ్‌లోకి వచ్చాడంటే
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. హార్దిక్ విభిన్నమైన ఆటగాడని, ఫామ్‌లోకి వస్తే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా అతనిలో ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో హార్దిక్ టచ్‌లోకి రావడం ముంబై ఇండియన్స్‌కు శుభపరిణానమన్నాడు.
'హార్దిక్ పాండ్యా ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు. కొన్నిసార్లు 100 శాతం సిద్దంగా లేనప్పుడు అది మన మదిలో వెంటాడుతుంది. కాబట్టి హార్దిక్ జట్టులోకి రావడంతో పాటు ఫామ్ అందుకోవడం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశం. చాలా రోజులుగా నాకు హార్దిక్ తెలుసు. అతను గనుక ఫామ్‌లోకి వచ్చాడంటే సులువుగా 4-5 మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించగలడు' అని శాస్త్రి చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ చివరిది
యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. 2019 వరకు శాస్త్రి తొలిసారి రెండేళ్ల కాలపరిమితికి ఎంపికయ్యాడు. రవిశాస్త్రి సక్సెస్ అవ్వడంతో అనంతరం మళ్లీ రెండేళ్లకు తన కాలపరిమితిని పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత తన గడువు ముగియనుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్ ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీమిండియా దిగ్గజాలు రాహుల్, ద్రవిడ్ లేదా కోచ్ కుంబ్లేకు బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications

IPL 2021:'పరుగులు చేయకపోతే ఎవరైనా ఒకటే..వార్నర్‌కు ఏం జరిగిందో చూశాం!ఆ సీఎస్‌కే ప్లేయర్‌కు అదే జరగొచ్చు'










