RR vs CSK: నమ్మశక్యం కాని బ్యాటింగ్ అది.. అతడి ఆటతీరు చూసి భయపడ్డాం: సంజూ శాంసన్

అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ నమ్మశక్యం కానిదని రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఓ దశలో గైక్వాడ్ బ్యాటింగ్ చూసి భయపడ్డామన్నాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (50; 21 బంతుల్లో 6×4, 3×6), ఆల్‌రౌండర్ శివమ్ దూబే (64 నాటౌట్; 42 బంతుల్లో 4×4, 4×6) చెలరేగడంతో శనివారం రాత్రి 7 వికెట్ల తేడాతో చెన్నైని రాజస్థాన్ ఓడించింది.
చెన్నై నిర్ధేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలంటే.. మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ రాయల్స్ గెలుపొందాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఈరోజు అతడిదే అనుకున్నాం
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'మా బ్యాటింగ్ లైనప్‌లోని ఆటగాళ్ల సామర్థ్యం మాకు తెలుసు. అందుకే ఓడినప్పుడల్లా కాస్త బాధ, నిరాశ కలుగుతుంది. అలాంటి సమయంలో మాకు మేమే ధైర్యం తెచ్చుకోవాలి. చివరి 3-4 ఓవర్లలో వికెట్ బాగా టర్న్ అయింది. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో ఇది మరింత మెరుగ్గా ఉంటుందని అర్ధం అయింది.
నేను ఊహించినట్టు జరిగినందుకు సంతోషంగా ఉంది. మా ఓపెనర్లు శుభారంభాలు అందిస్తున్నారు. వాళ్లు పవర్ ప్లేలోనే ఈ మ్యాచ్‌పై పట్టు సాధించారు. దాదాపు మ్యాచును ముగించారు. యశస్వి జైశ్వాల్ ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నాడు. ఇక శివమ్ దూబే బ్యాటింగ్ గురించి కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో చెలరేగడంతో ఈరోజు అతడిదే అనుకున్నాం' అని అన్నాడు.

గైక్వాడ్‌ను చూసి భయపడ్డాం
'చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు. అతడి ఆటతీరు చూసి భయపడ్డాం. అతడు వైవిధ్యమైన షాట్లు ఆడటమే కాకుండా.. ఆడే విధానంలో ఎలాంటి రిస్కు తీసుకోడు. అలాంటి ఆటగాడిని ఎవరైనా గౌరవించాలి. రుతురాజ్ సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అతడి ఆటకు ఫిదా అయ్యాను. అందరూ గైక్వాడ్‌ను ప్రశంసించి తీరాలి.
ఇది అతడి రోజు. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించి మేం పెద్దగా ఆలోచించడం లేదు. ఒక్కొక్క మ్యాచ్‌పై దృష్టిసారించి ముందుకు వెళ్లాలని చూస్తున్నాం' అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. ఈ మ్యాచులో గైక్వాడ్ 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.

లైఫ్ లభించడంతో చెలరేగిన జైశ్వాల్
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, ఎవిన్ లూయిస్ పోటీపడి ఫోర్లు, సిక్స్‌లు దంచడంతో రాజస్థాన్ 5 ఓవర్లకే 75/0తో నిలిచింది. జోష్ హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో అంబటి రాయుడు క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన జైశ్వాల్.. ఆపై అయిదో ఓవర్లో వరుసగా 6, 6, 4, 6 దంచేశాడు. ఓపెనర్లిద్దరూ రెండు పరుగుల తేడాతో నిష్క్రమించినా.. పరుగుల వేగం తగ్గింది. ఈ సమయంలో శివమ్ దూబే మరింతగా రెచ్చిపోయాడు.
మరోవైపు కెప్టెన్ శాంసన్ సహకరిస్తుండగా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. బలమైన షాట్లతో భారీ సిక్స్‌లు బాదుతూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 13 ఓవర్లకు స్కోరు 153/2గా ఉంది. మిగిలిన పని పూర్తి చేయడానికి రాజస్థాన్ పెద్దగా శ్రమపడలేదు. జట్టు స్కోరు 170 వద్ద శాంసన్ ఔటైనా.. గ్లెన్ ఫిలిప్స్ (14 నాటౌట్)తో కలిసి దూబే రాజస్థాన్‌కు అద్భుత విజయం అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
RCB Playing XI vs PBKS: బెంగళూరు వంతొచ్చింది.. ఇప్పుడైనా అడుగుపడేనా! పంజాబ్‌ను ఢీకొట్టే ఆర్‌సీబీ జట్టు ఇదే!!