For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB Playing XI vs PBKS: బెంగళూరు వంతొచ్చింది.. ఇప్పుడైనా అడుగుపడేనా! పంజాబ్‌ను ఢీకొట్టే ఆర్‌సీబీ జట్టు ఇదే!!

RCB Playing XI vs PBKS: Kyle Jamieson out and George Garton in for match 48

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఆదివారం రెండు ఉత్కంఠ పోరులకు తెరలేవనుంది. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య జరుగనుంది.ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పంజాబ్ జట్టుకు. ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఇదో స్థానంలో ఉంది.

మిగిలిన రెండు మ్యాచుల్లో విజయాలు సాధిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ ప్లేయింగ్ ఎలెవన్ ఓసారి పరిశీలిద్దాం.

అడుగుపడేనా

అడుగుపడేనా

ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్‌తో కలిసి పంజాబ్ 10 పాయింట్లతో సమంగా ఉంది. పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ 'డూ ఆర్ డై' మ్యాచ్‌ చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు బెర్తు ఖరారవుతుంది.

ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న మిగతా నాలుగు జట్లలో ఏదీ ఎనిమిది విజయాలు సాధించే అవకాశం లేదు కాబట్టి బెంగళూరు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా ముందంజ వేస్తుంది. ఒకవేళ ఆర్‌సీబీ చేతిలో ఓడితే పంజాబ్‌ పనైపోయినట్లే. రెండు జట్ల మధ్య విజయాలను మనం ఓ సారి పరిశీలిస్తే.. పంజాబ్‌ జట్టు ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పంజాబ్ 15, బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది.

ఏబీ, మ్యాక్సీ చెలరేగితే

ఏబీ, మ్యాక్సీ చెలరేగితే

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తున్నారు. ఇద్దరు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నారు. ఎవరైనా ఒకరు భారీ స్కోరుతో అలరిస్తున్నారు. దాంతో ఆర్‌సీబీకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం లభిస్తోంది. మూడో స్థానంలో ఆడుతున్న శ్రీకర్ భారత్ కూడా అదరగొడుతున్నాడు. అయితే మొదటి దశలో అదరగొట్టిన స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు.

ఈ ఇద్దరు వేగంగా పరుగులు చేస్తున్నా.. తమదైన శైలిలో ఆకట్టుకోలేకపోతున్నారు. వీరు కూడా చెలరేగితే బెంగళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. తొలి దశలో ఈ ఇద్దరు బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

RR vs CSK: 19 బంతుల్లో హాఫ్ సెంచరీ.. యశస్వి జైశ్వాల్‌ నెలకొల్పిన రికార్డులు ఇవే!!

జేమీసన్ స్థానంలో గార్టన్

జేమీసన్ స్థానంలో గార్టన్

బెంగళూరు ఆల్‌రౌండర్‌లు డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్ కూడా తన వంతుగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో కూడా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. కైల్ జేమీసన్ గతంలో లాగా బౌలింగ్ చేయడం లేదు. బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపించట్లేదు. దాంతో అతడి స్థానంలో జార్జ్ గార్టన్ జట్టులోకి రానున్నాడు. ఇక వనిందు హసరంగ వరుస మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోవడంతో అతడి స్థానం అనుమానమే. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్ రాణించాల్సిన అవసరం ఉంది. నవదీప్ సైనీని మరోసారి నిరాశే ఎదురుకానుంది. మొత్తానికి పటిష్టంగా ఉన్న బెంగళూరుకు ఈ విజయం సులువే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా)

విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కోన శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, కైల్ జేమీసన్/జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

Story first published: Sunday, October 3, 2021, 9:19 [IST]
Other articles published on Oct 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+