
సంతోషమే కానీ
ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు. చివరి బంతికి సిక్స్ బాది సూపర్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సెంచరీ చేసిన గైక్వాడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ట్రోఫీ అందుకున్న అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ... 'పిచ్ మొదట నెమ్మదిగా ఉండి తర్వాత పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది.
మా బ్యాట్స్‌మెన్‌లో ఎవరైనా ఒకరు 14-15 ఓవర్ల దాకా క్రీజులో ఉండాలని అనుకున్నాం. అయితే నేను చివరి వరకూ ఉండిపోయా. ఈ క్రమంలోనే ఇన్ని రోజులూ చేయలేనిది (శతకం) ఈరోజు పూర్తిచేశా. సెంచరీ చేసినందుకు సంతోషమే కానీ.. మ్యాచ్ ఓడినందుకు బాధగా ఉంది' అని అన్నాడు.
RR vs CSK: నమ్మశక్యం కాని బ్యాటింగ్ అది.. అతడి ఆటతీరు చూసి భయపడ్డాం: సంజూ శాంసన్

సెంచరీ చేస్తాననుకోలేదు
'నా సాధనలో టైమింగ్‌పై ఎక్కువ దృష్టిసారిస్తా. అదే నాకు ఇన్ని రోజులుగా కలిసివస్తోంది. ఈరోజు కూడా బ్యాటింగ్‌లో టైమింగ్ మీదే మనసు లగ్నం చేశా. దాంతోనే బాగా ఆడా. తొలుత నెమ్మదిగా ప్రారంభించినా.. సెంచరీ చేస్తాననుకోలేదు. జట్టు స్కోర్‌ను 160-170కి తీసుకెళ్తే చాలనుకున్నా. నేను 2019లో తొలిసారి చెన్నై జట్టులో చేరా. కానీ అప్పుడు ఆడే అవకాశం దక్కలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ చాలా విషయాలు నేర్చుకున్నా. సీనియర్లు సలహాలు ఇచ్చారు. అవన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. నేను ఈ మ్యాచ్‌లో శతకం చేయడం మంచిదే అయినా.. మేం గెలిచి ఉంటే ఇంకా బాగుండేది' అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

250 పరుగులు చేసుంటే బాగుండే
'టాస్ ఓడటం కలిసిరాలేదు. 190 అనేది మంచి స్కోరే. అయినా తేమ ప్రభావం చూపించడంతో బంతి బ్యాట్‌పైకి దూసుకొచ్చింది. ఇలాంటి పిచ్‌పై బాగా ఆడొచ్చు. రాజస్థాన్ అదే చేసింది. మా బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. తొలి 6 ఓవర్లలోనే రాజస్థాన్ ఓపెనర్లు మ్యాచ్‌ను లాగేసుకున్నారు. రాజస్థాన్ ఆడిన తీరు చూస్తే మేం 250 పరుగులు చేసుంటే బాగుండేదని అనిపించింది.
వాళ్ల స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్న పిచ్.. తర్వాత బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించింది. దీంతో రుతురాజ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ పరిస్థితులను అంచనా వేసి ఆడాలి. రాజస్థాన్ ఆటగాళ్లు అదే చేశారు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఎందుకంటే.. ప్లే ఆఫ్స్‌లో ఇలాగే జరిగితే అప్పుడు ఉపయోగపడుతుంది' అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు.


Click it and Unblock the Notifications












