RR vs CSK ప్రివ్యూ: సీఎస్‌కే జైత్రయాత్ర కొనసాగేనా? రాజస్థాన్ బోణీ కొట్టెనా? తుది జట్లు ఇవే!

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లోనే షార్జా మైదానం వేదికగా ఐపీఎల్ అరంగేట్ర చాంపియన్ రాజస్థాన్ రాయల్స్.. త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. ఇప్పటికే సీఎస్‌కే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లలో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు మరోసారి అసలైన ఐపీఎల్ మజా అందనుంది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్యంలో రాజస్తాన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
విజయంతోనే ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలని ఆ జట్టు భావిస్తుండగా.. గత మ్యాచ్ ఫలితాన్నే రిపీట్ చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతోంది. పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నా చెన్నై సూపర్ కింగ్సే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడగా 14-7తో చెన్నై సూపర్ కింగ్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ధోనీసేన భావిస్తోంది. మరీ ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి!

రెట్టించిన ఉత్సాహంతో ధోనీసేన
స్టార్ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లీగ్ నుంచి తప్పుకున్నా.. జట్టు మొత్తం కరోనా కొరల్లో చిక్కుకున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదని గత మ్యాచ్ ఫలితంలో అర్థమైంది. అనుభవపూర్వకమైన ఆటతో ఆ జట్టు బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. అదే స్పూర్తిని ఈ మ్యాచ్‌లో కొనసాగించాలనుకుంటుంది. షేన్ వాట్సన్, మురళీ విజయ్ విఫలమైనా.. అంబటి రాయుడు, ఫాఫ్ డూప్లెసిన్ ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో సామ్ కరన్, పియూష్ చావ్లా మెరిసారు. మరోసారి వీళ్లే కీలకం కానున్నారు.
ఇక కరోనా బారిన పడిన యువ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచింది. అయితే అతను తుది జట్టులో ఉంటాడా? అనేది డౌటే. ఎందుకంటే విన్నింగ్ టీమ్‌ను మార్చే సాహసం ధోనీ చేయకపోవచ్చు. కాకపోతే చిన్న మైదానం అయిన షార్జాలో మరో బౌలర్ అవసరం అనుకుంటే మాత్రం మురళీ విజయ్‌ను పక్కన పెట్టి షార్దుల్ ఠాకుర్‌ను తీసుకోవచ్చు. ఆరంభ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో విజయ్ విఫలమయ్యాడు.

స్టీవ్ స్మిత్‌పైనే భారం..
ఇక తొలి మ్యాచ్ ఆడుతాడో లేదో అనుకున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాడు. కంకషన్ గాయం నుంచి కోలుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తేలిపోయిన అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన అనంతరం నేరుగా కాకుండా ఫ్యామిలీని కలిసి వచ్చిన జోస్ బట్లర్ క్వారంటైన్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. స్టార్ ఆల్‌రౌండ్ బెన్ స్టోక్స్ ఇంకా జట్టుతో చెరలేదు. దీంతో స్మిత్, డేవిడ్ మిల్లర్‌పైనే జట్టు భారం పడింది.
ఈ ఇద్దరికి తోడుగా సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప, యశస్వి జైస్వాల్ చెలరేగితే రాజస్థాన్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. జోస్ బట్లర్ గైర్హాజరీ కారణంగా అండర్-19 స్టార్ యశస్వీ జైస్వాల్‌తో ఊతప్ప ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు. ఆ తర్వాత శాంసన్, స్మిత్, మిల్లర్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, వరున్ ఆరోన్, టామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. శ్రేయస్ గోపాల్, రియాన్ పరాగ్ స్పిన్ మ్యాజిక్ చేస్తే తిరుగుండదు.

తుది జట్లు (అంచనా)
చెనై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, మురళీ విజయ్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, సామ్ కరన్
రాజస్థాన్ రాయల్స్: రాబిన్ ఊతప్ప, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేశ్ ఉనాద్కట్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్
పిచ్ రిపోర్ట్:
చిన్న బౌండరీలు కావడంతో భారీ స్కోర్‌కు అవకాశం ఉంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అయితే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కష్టం అవుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లో కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. అయితే చెన్నై మినహా మిగతా రెండు జట్లు ఓటమిపాలయ్యాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్ !
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications