
పిచ్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ 10 సార్లు గెలుపొందగా.. చెన్నై 15 విజయాలు అందుకుంది. షేఖ్ జాయద్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో రాజస్థాన్ గెలుపొందింది. ఐపీఎల్ 2021లో రాజస్థాన్, చెన్నై తలపడిన మ్యాచులో సీఎస్‌కే విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో మూడు చెన్నై గెలుపొందింది. రాజస్థాన్ జట్టుపై చెన్నై అత్యధికంగా 246/5, చెన్నై జట్టుపై రాజస్థాన్ 223/5 పరుగులు చేసింది. ఇక షేఖ్ జాయద్ స్టేడియంలో ఉష్ణోగ్రత 33 సెల్సియన్ ఉండనుంది. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పులేదు. దుబాయ్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించనుంది. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో చెలరేగే అవకాశం ఉంది.

రైనా బ్యాట్ జుళిపిస్తే:
ఓటమి అంటూ తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది. వరుస విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మొదట బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా వీరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అలీ వేగంగా ఆడుతూ విలువైన పరుగులు చేస్తున్నాడు. అయితే మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. మహీ గత మ్యాచులో విన్నింగ్ సిక్సర్ బాదినా.. తనదైన శైలిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇద్దరు బ్యాట్ జుళిపిస్తే బ్యాటింగ్ విభాగంలో చెన్నైకి ఎదురులేకుండా పోతుంది.

కీలక ఆటగాళ్లకు విశ్రాంతి?:
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటిచేత్తో మ్యాచులు మలుపు తిప్పగలడు. ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలడు. ఇప్పటికే అతడెంతో నిరూపించుకున్నాడు. అంతేకాదు బంతితో కూడా రాణించగలడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. అయితే కీలక ప్లే ఆఫ్ కోసం అతడిని తాజాగా ఉంచేందుకు రెస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అతడి స్థానంలో సామ్ కరన్ ఆడనున్నాడు. బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్ కూడా తమ బాధ్యత నిర్వర్తిస్తూ విజయాల్లో భాగమవుతున్నారు. అయితే ఎలాగూ ప్లే ఆఫ్ వెళ్లింది కాబట్టి చెన్నై కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.

ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే:
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్ రాయల్స్‌కు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు 'డూ అర్ డై'గా మారిన ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. కెప్టెన్ సంజు శాంసన్ తప్ప.. ఏ బ్యాటర్ పరుగులు చేయడం లేదు. ఎవిన్ లూయిస్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కీలక మ్యాచ్ కాబట్టి లియామ్ లివింగ్‌స్టోన్, యశశ్వి జైస్వాల్, మహిపాల్, మిల్లర్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. అయితే మిల్లర్ స్థానంలో క్రిస్ మోరిస్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. అందరూ రాణిస్తే రాజస్థాన్ సునాయాస విజయం అందుకోనుంది. రాజస్థాన్‌కు పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా బలంగా కనిపిస్తున్నారు. వారు రాణిస్తే శాంసన్ సేనకు తిరుగుండదు. అయితే పటిష్ట చెన్నైని ఓడించాలంటే రాజస్థాన్ కష్టపడాల్సిందే.

తుది జట్టు (అంచనా):
రాజస్తాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్,
డేవిడ్ మిల్లర్/క్రిస్ మోరిస్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహమాన్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, సామ్ కరన్/డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

డ్రీమ్ 11 టీమ్:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), మొయిన్ అలీ, జోష్ హాజెల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రహమాన్, దీపక్ చహర్.
KKR vs PBKS: చాలా తెలివిగా ఆడాం.. ఈ రెండు పాయింట్లు మాకు ఎంతో ముఖ్యం! వారిని పక్కనబెట్టడం ఇబ్బందే!!


Click it and Unblock the Notifications












