Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR Team For IPL 2022:ఆ ఒక్కటి తప్పా టీమ్ సూపరో సూపర్..! సంజూ గానీ చెలరేగితే టైటిలే! తుది జట్టు అంచనా ఇదే

 RR Team For IPL 2022: Rajasthan Royals Playing 11, Batting, Bowling And Complete Review

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్ర సీజన్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. క్రికెట్‌‌ బ్యాడ్‌‌బాయ్‌‌ షేన్‌‌ వార్న్‌‌ అద్భుతాలు చేయడంతో.. టైటిల్‌‌ను ఎగరేసుకుపోయింది. ఇక ఆనాటి నుంచి నేటి వరకు లీగ్‌‌లో అనామక జట్టుగానే కొనసాగుతున్నది..! సీజన్లు గడుస్తున్నా.. ప్లేయర్లు మారుతున్నా.. రాయల్స్‌‌ రాత మాత్రం మారడం లేదు.! మరీ ముఖ్యంగా గత మూడు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన మరీ దారుణం. ఆఖరి స్థానం కోసం పోటీపడింది. టీమ్ డైరెక్టర్‌గా కుమార సంగక్కర, కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను తీసుకొచ్చినా టీమ్‌కు కలిసిరాలేదు. అయితే మెగా వేలం పుణ్యమా ఈసారి ఆర్‌ఆర్‌గా బలంగా కనిపిస్తోంది. వేలంలో అదరగొట్టిన రాజస్థాన్ సత్తా కలిగిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

వేలంలో ఆర్ఆర్ అదుర్స్..

వేలంలో ఆర్ఆర్ అదుర్స్..

మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. తమ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసింది. ప్రతీ సీజన్ వేలంలో ఏదో ఒక తప్పు చేసే రాజస్థాన్ ఈ సారి మాత్రం అద్భుతమైన ఆటగాళ్లను తీసుకుంది. సంజూ శాంసన్(రూ.14 కోట్లు), జోస్ బట్లర్(రూ.10 కోట్లు), యశస్వీ జైస్వాల్(రూ.4 కోట్లు) ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో రూ.62 కోట్ల భారీ పర్స్ మనీతో వేలంలో పాల్గొన్నది. దాంతోనే తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకోగలిగింది. అయితే రిటెన్షన్‌లో తీసుకున్న ముగ్గురూ.. టాపార్డర్ బ్యాట్స్‌మన్ కావడంతో.. వేలంలో బౌలింగ్, ఆల్‌రౌండర్స్‌‌లపైనే రాజస్థాన్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పైగా గత కొన్నేళ్లుగా తమను సతాయించిన స్పిన్ విభాగాన్ని పటిష్టపరుచుకుంది.

స్మార్ట్ అండ్ సూపర్ పిక్స్ ఇవే..

స్మార్ట్ అండ్ సూపర్ పిక్స్ ఇవే..

తొలి రోజు మిడిలార్డర్, ఫాస్ట్ బౌలర్లపైనే ఫోకస్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్ సత్తా కలిగిన ఆటగాళ్లను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఫించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్, సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ వాన్ డర్ డస్సెన్, న్యూజిలాండ్ సెన్సేషన్ డారిల్ మిచెల్‌ను తీసుకుంది. ఈ ఆటగాళ్లందరినీ తమ బడ్జెట్‌లోను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో హెట్‌మైర్‌కు మంచి అనుభవం ఉండగా.. డారిల్ మిచెల్ టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. అంతేకాకుండా స్లోయర్ బౌన్సర్ ఓబే మొకాయ్, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌, పేస్ ఆల్‌రౌండర్స్ జిమ్మీ నీషమ్, నాథన్ కౌల్టర్ నైల్‌లను తీసుకుంది. ముంబై ఇండియన్స్‌కు చెందిన ముగ్గురు పాత ప్లేయర్లను రాజస్థాన్ కొనుగోలు చేయడం విశేషం. గత కొన్నేళ్లుగా తమను ఇబ్బంది పెట్టిన స్పిన్ విభాగాన్ని ఈసారి బలంగా మార్చింది. భారత సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లను అగ్గువకే కొనుగోలు చేసింది. దేవదత్ పడిక్కల్‌తో పాటు తమ పాత ప్లేయర్ రియాన్ పరాగ్‌లను కూడా తెలివిగా దక్కించుకుంది.

బ్యాకప్ సూపర్.. కానీ..

బ్యాకప్ సూపర్.. కానీ..

ఇక టీమ్ బ్యాకప్ ఆప్షన్ కూడా బలంగానే కనిపిస్తున్నాయి. డారిల్ మిచెల్, నాథన్ కౌల్టర్‌నైల్, ఓబే మొకాయ్, కరుణ్ నాయర్‌లతో బ్యాటింగ్, బౌలింగ్ బెంచ్ బలంగానే ఉంది. స్పిన్నర్లలో కేసీ కరియప్ప రూపంలో మంచి బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడు. ఇండియన్ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, నవ్‌దీప్ సైనీలు కూడా జట్టుకు బలం కానున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, బ్యాకప్ బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో టీమ్ లోయరార్డరే కొంచెం బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదో స్థానం వరకు బలమైన బ్యాటర్లే ఉన్నా.. పేస్, స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన జిమ్మీ నీషమ్, కౌల్టర్ నైల్, రవిచంద్రన్ అశ్విన్‌ల బ్యాటింగ్‌పైనే సందేహాలు నెలకొన్నాయి.

ఇక టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ గానీ బ్యాట్ ఝులిపితే రాజస్థాన్‌కు తిరుగుండదు. మంచి హిట్టింగ్ సామర్థ్యం కలిగిన సంజూ శాంసన్.. ఇప్పటి వరకు తన టాలెంట్‌కు తగిన న్యాయం చేయలేకపోయాడు. ఒకటి, రెండు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం ఆ తర్వాత వరుసగా విఫలమవ్వడం అతని బ్యాటింగ్ నైజం. అయితే గతేడాది అద్భుతంగా రాణించాడు. కెప్టెన్సీ నేపథ్యంలో బాధ్యతాయుతంగా ఆడుతూ 400 పైగా రన్స్ చేశాడు. ఈ సారి మంచి టీమ్‌ ఉన్న నేపథ్యంలో సంజూ గానీ బ్యాట్‌తో చెలరేగితే రాజస్థాన్ టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఓపెనర్లుగా బట్లర్, పడిక్కల్..

ఓపెనర్లుగా బట్లర్, పడిక్కల్..

ఇక రాజస్థాన్ తుది జట్టు అంచనాను పరిశీలిస్తే.. జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. పడిక్కల్‌ను మిడిలార్డర్ ఆడిస్తే మాత్రం.. యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో పడిక్కల్, జైస్వాల్‌లో ఒకరు ఆడవచ్చు. కెప్టెన్ సంజూ శాంసన్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. బిగ్ హిట్టర్ షిమ్రాన్ హిట్‌మైర్ ఐదో స్థానంలో ఆడే చాన్సుంది. ఆరో స్థానంలో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్లు నాథన్ కౌల్టర్ నైట్, జిమ్మీ నీషమ్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. బౌలింగ్ ఆప్షన్ ఎక్కువ కావాలనుకుంటే కౌల్టర్ నైల్, బ్యాటింగ్ అవసరమైతే జిమ్మీ నీషమ్ ఆడవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనుండగా.. బౌలర్లుగా ట్రెంట్ బౌల్ట్, చాహల్, ప్రసిధ్ కృష్టలకు అవకాశం దక్కనుంది.

 తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

జోస్ బట్లర్, పడిక్కల్, జైస్వాల్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్డర్ నైల్/ జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ

రాజస్థాన్ పూర్తి టీమ్:

రాజస్థాన్ పూర్తి టీమ్:

సంజూ శాంసన్(రూ.14 కోట్లు), జోస్ బట్లర్(రూ.10 కోట్లు), యశస్వీ జైస్వాల్(రూ.4 కోట్లు), ప్రసిధ్ కృష్ణ(రూ.10 కోట్లు), షిమ్రాన్ హెట్‌మైర్(రూ.8.50 కోట్లు), ట్రెంట్ బౌల్ట్(రూ.8 కోట్లు), దేవదత్ పడిక్కల్(రూ.7.75 కోట్లు), యుజ్వేంద్ర చాహల్(రూ.6.50 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్(రూ.5 కోట్లు), రియాన్ పరాగ్(రూ.3.80 కోట్లు), నవ్‌దీప్ సైనీ(రూ.2.60 కోట్లు), నాథన్ కౌల్టర్ నైల్(రూ.2 కోట్లు), జేమ్స్ నీషమ్(రూ.1.50 కోట్లు), కరుణ్ నాయర్(రూ.1.40 కోట్లు), రాసీ వాన్‌డెర్ డస్సెన్(రూ. కోటి), జార్జ్ గార్టన్(రూ.75 లక్షలు), ఓబెయిడ్ మెక్కాయ్(రూ.75 లక్షలు), కేసీ కరియప్ప(రూ.30 లక్షలు), కుల్దీప్ సేన్(రూ.20 లక్షలు), ధృవ్ జురెల్(రూ.20 లక్షలు), తేజస్ బరోకా(రూ.20 లక్షలు), కుల్దీప్ యాదవ్(రూ.20 లక్షలు), శుభ్‌మ్ గర్హెల్(రూ.20 లక్షలు), అనునయ్ సింగ్(రూ.20 లక్షలు)

Story first published: Wednesday, March 2, 2022, 15:00 [IST]
Other articles published on Mar 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+