For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR Playing XI: వ్యూహాత్మక మార్పు.. సన్‌రైజర్స్‌తో తలపడే రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఆదివారం చెన్నై వేదికగానే జరిగే ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో తలపడనుంది.

దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే జోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది.

RR Playing XI vs SRH for IPL 2024 Qualifier-2 Keshav Maharaj IN and Rovman Powell OUT

సస్పెన్స్ థ్రిల్లర్ ..
మరోవైపు క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నెలలోనే ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క పరుగుతో గెలిచింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో భువీ బౌలింగ్‌లో రోవ్‌మన్ పోవెల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో సన్‌రైజర్స్ గెలుపొందింది.

మరోసారి ఇరు జట్ల మధ్య అదే తరహా మ్యాచ్‌ను అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే చెపాక్ మైదానం స్లో వికెట్ కావడం.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది.

వ్యూహాత్మక మార్పు..
ఎక్స్‌ట్రా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను ఆడించే ఛాన్స్ ఉంది. ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ చేస్తే మాత్రం ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతో బరిలోకి దిగి పరిస్థితులకు తగ్గట్లు రోవ్‌మన్ పోవెల్ లేదా కేశవ్ మహారాజ్‌లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించనుంది. ఈ ఒక్కటి మినహా తుది జట్టులో ఎలాంటి మార్పు చేసే అవకాశం లేదు.

ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్ బరిలోకి దిగనున్నారు. రోవ్‌మన్ పోవెల్, కేశవ్ మహరాజ్‌లో ఒకరికి చోటు దక్కనుంది. అశ్విన్, చాహల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా.. ట్రేంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ పేస్ బౌలింగ్‌ను లీడ్ చేయనున్నారు. ఎలిమినేటర్ తరహాలో అందరూ సమష్టిగా రాణిస్తే రాజస్థాన్ రాయల్స్‌కు తిరుగుండదు.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్/కేశవ్ మహరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Story first published: Thursday, May 23, 2024, 21:09 [IST]
Other articles published on May 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+