Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR Playing XI vs CSK: అతను మళ్లీ బెంచ్‌కే.. చెన్నైతో ఆడే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్‌సీబీ‌తో గత మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో జోరు మీద ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆర్‌సీబీతో దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రియాన్ పరగా మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

RR Playing XI vs CSK:

ఆరంభ మ్యాచ్‌ల్లో వరుసగా అవకాశాలు అందుకున్న రియాన్ పరాగ్ దారుణంగా విఫలమవడంతో జట్టు నుంచి తప్పించారు. గత రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఓడినా.. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం రాజస్థాన్ టీమ్‌మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. ఓపెనర్లుగా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాలు అందిస్తున్నారు.

అయితే గత రెండు మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ దారుణంగా విఫలమవడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఫస్ట్ డౌన్‌లో సంజూ శాంసన్ ఆడుతుండగా.. నాలుగో స్థానంలో దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతున్నాడు. ఐదో స్థానంలో షిమ్రాన్ హెట్‌మైర్, ఆరో స్థానంలో ధృవ్ జురెల్ ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు విజయాలు అందించిన హెట్‌మైర్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను బ్యాట్ ఝులిపిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఆడనుండగా.. పేసర్లుగా ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ బరిలోకి దిగనున్నారు.

సీఎస్‌కేతో రాజస్థాన్ తుది జట్టు (అంచనా)
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Story first published: Wednesday, April 26, 2023, 19:04 [IST]
Other articles published on Apr 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+