LSG vs RR:రాజస్థాన్ రాయల్స్‌కు లైఫ్ అండ్ డెత్ గేమ్.. లక్నోకు టాప్ ప్లేస్ టెన్షన్! తుది జట్లు అంచనాలివే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్రతీ మ్యాచ్ ఆయా జట్లకు కీలకంగా మారింది. డబుల్ హెడర్‌లో భాగంగా నేటి రాత్రి 7.30 గంటలకు బ్రాబోర్న్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌కు చేరువలో ఉన్న లక్నో ఈ మ్యాచ్ గెలిచి ఎలాంటి టెన్షన్ లేకుండా టోర్నీలో ముందడుగేయాలని భావిస్తోంది. మరోవైపు 14 పాయింట్స్‌తో ఉన్నా రాజస్థాన్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు పేపర్‌పై బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను లభించనుంది.

హెట్‌మైర్ దూరం..
ఫస్టాఫ్ సీజన్‌లో జోస్ బట్లర్ పరుగుల మోత మోగించడంతో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలందుకుంది. అయితే పెటర్నిటీ లీవ్ కారణంగా హెట్‌మైర్ దూరమవ్వగా.. అతని స్థానం భర్తీ చేసే ఆటగాడు లేకపోయాడు. వాన్ డర్ డస్సెన్‌ను బరిలోకి దించినా అతను పెద్దగా రాణించడం లేదు. యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశమే అయినా బ్యాటింగ్ డెప్త్ బలహీనంగా కనిపిస్తోంది. అశ్విన్ టాపార్డర్‌లో ఆడించిన జట్టు ఆశించిన ఫలితం రాబట్టింది. సేమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతారా? లేక కుల్దీప్ సేన్ స్థానంలో జిమ్మీ నీషమ్‌ను తీసుకు వస్తారో? చూడాలి. కుల్దీప్ ఆరంభంలో రాణించినా.. తర్వాత విఫలమయ్యాడు.

హోల్డర్ డౌట్..
లక్నో సూపర్ జెయింట్స్‌కు మిడిలార్డర్ స్లాట్ వెలతిగా ఉంది. ఆరంభంలో మనీశ్ పాండేకు అవకాశం ఇవ్వగా అతను పెద్దగా రాణించలేదు. దాంతో కరణ్ శర్మకు అవకాశం ఇచ్చారు. అతను కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. డికాక్,రాహుల్, హుడా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఎవిన్ లూయిస్‌ను జట్టులోకి తీసుకుంటే జాసన్ హోల్డర్ బెంచ్‌కు పరిమితమవుతాడు. అప్పుడు కృష్ణప్ప గౌతమ్ జట్టులోకి వస్తాడు.

తుది జట్లు(అంచనా)
లక్నో: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కరన్ శర్మ/ఎవిన్ లూయిస్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, ఆయూష్ బదోని, కృష్ణప్ప గౌతమ్/ జాసన్ హోల్డర్, మోహ్‌సిన్ ఖాన్, దుష్మంత్ చమీరా, ఆవేష్ ఖాన్
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, డస్సెన్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications