Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR in RRR:రామ్‌చరణ్‌‌లా బట్లర్.. ఎన్టీఆర్‌లా యశస్వీ! ‘నాటు నాటు వీర నాటు’! (వీడియో)

RR: Jos Butler As Ram Charan And Yashasvi As NTR From RRR Movie Natu Song

హైదరాబాద్: ఈ మధ్య తెలుగులో వస్తున్న సినిమాలు, పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తుండటంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దర్శకధీరుడు రాజమౌళీ 'బాహు బలి'మూవీతో మొదలైన ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్పా' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు రాజమౌళీ తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది.

మల్లీ స్టారర్ మూవీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాటు నాటు వీర నాటు సాంగ్‌కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్‌కు సినీ ప్రేమికులంతా ఫిదా అయ్యారు. ఎంతలా అంటే ఆ సాంగ్‌ను రీ క్రియేట్ చేసేంత. ప్రతీ ఒక్కరూ ఈ పాటను రీక్రియేట్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొందరూ నిజంగానే స్టెప్స్ వేస్తే.. మరికొందరు మాత్రం ఫేషియల్ యాప్స్‌తో ఎడిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్(RR)..ఈ సాంగ్ స్టెప్స్‌ను తమ ఆటగాళ్లతో రీ క్రియేట్ చేసింది. రామ్‌చరణ్‌లా జోస్ బట్లర్.. ఎన్టీఆర్‌లా యశస్వీ జైస్వాల్‌ ఫేస్‌లను ఎడిటి చేసి ఈ వీడియోను ఫేస్‌బుక్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. 'ఆటగాళ్లను రిటైన్ చేసుకోకున్నా.. అడ్మిన్‌గా నిన్ను మాత్రం వదలరు అడ్మిన్ మామా'అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్‌ను మాత్రమే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం జరగనుంది. ఇక భారత్ వేదికగానే లీగ్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ.. కరోనా కేసులు పెరిగితే మాత్రం శ్రీలంకకు తరలించాలనుకుంటుంది.

Story first published: Thursday, January 13, 2022, 15:35 [IST]
Other articles published on Jan 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+