Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడాం: రాజస్థాన్ కోచ్

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 15వ ఓవరే తమ ఓటమికి ప్రధాన కారణమని రాజస్థాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అతని ఓవర్ కారణంగా తమ జట్టు డెత్ ఓవర్లలో 20 పరుగులు తక్కువగా చేసిందని చెప్పాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. మిచెల్ స్టార్క్ 15వ ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో 160/2తో పటిష్టంగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్ 193/8 స్కోర్‌కే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సునాయస విజయాన్నందుకుంది.

మిచెల్ దెబ్బతో మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విక్రమ్ రాథోడ్.. మిచెల్ స్టార్క్ దెబ్బతో డసన్ షనకను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించాల్సి వచ్చిందని చెప్పాడు. దాంతో ఒక స్పెషలిస్ట్ బౌలర్‌ సేవలను కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. '14 ఓవర్లకు 160/2 ఉన్న మేం 220 పరుగులు చేయాల్సింది. కానీ మిచెల్ స్టార్క్ దెబ్బతో 20 పరుగులు తక్కువగా చేశాం. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడం మా భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది. ఆ ఓవర్‌లో కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. ఆ ఓవర్ మా పతనాన్ని శాసించింది. స్టార్క్ ప్రపంచ స్థాయి బౌలర్ అయినా.. మా బ్యాటర్ల షాట్ సెలెక్షన్ సరిగ్గా లేదు.

RR Coach Vikram Rathour Says Mitchell Starc s 15th Over and Poor Batting Decisions Cost Us the Match

మేం ముందుగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకున్నాం. కానీ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడంతో డసన్ షనకను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాల్సి వచ్చింది. లేదంటే.. రెండో ఇన్నింగ్స్‌లో స్పెషలిస్ట్ బౌలర్‌ను ఆడించేవాళ్లం. మైదానంలో తుది నిర్ణయం కెప్టెన్‌దే. ప్రణాళికలను కోచ్‌లు రచించినప్పటికీ మైదానంలో తుది నిర్ణయం సారథిదే.

వైభవ్‌కు ఆ సమస్య లేదు..

కండరాల నొప్పితో ఇబ్బంది పడుతుండటంతోనే రియాన్ పరాగ్ బౌలింగ్ చేయలేదు. రవీంద్ర జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతనికి తగిన విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించింది. వైభవ్ సూర్యవంశీకి స్లో బాల్స్ ఎదుర్కోవడం బలహీనంగా మారిందని నేను అనుకోవడం లేదు.

బంతి కొద్దిగా ఆగుతూ వచ్చే వికెట్లపై పేస్ వేరియేషన్స్ చూపిస్తే ఎవరికైన వర్కౌట్ అవుతుంది. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడు. తన సామర్థ్యం ఏంటో నిరూపించుకున్నాడు. అతనికి లభిస్తున్న మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చాలని నేను ఆశిస్తున్నా.

కోహ్లీలా తమ శైలిని నమ్ముకోవాలి..

జట్టులో అందరూ వైభవ్, ధ్రువ్ జురెల్‌లా ఆడాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్‌లో వారు బ్యాటింగ్ చేయాలి. ఆటగాళ్లు తమ బలాన్ని నమ్ముకుంటే విజయం సాధించగలరు. దీనికి చక్కని ఉదాహరణ విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్‌లో అతను ఇప్పటికీ సక్సెస్ అవుతున్నాడు. అతను ఏ మాత్రం పవర్ హిట్టర్ కాదు.

తన శైలిని నమ్ముకొని రాణిస్తున్నాడు. ఈ ఓటమితో మేం నిరాశకు గురవ్వడం లేదు. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఇప్పుడు మా ఆలోచన కూడా అదే. మేం పూర్తి సామర్థ్యంతో ఆడితే.. ఏ జట్టునైనా ఓడించగలం.’అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, May 18, 2026, 16:16 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+