Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో వైభవ్ కోపంగా ఉన్నాడు: రాజస్థాన్ రాయల్స్ కోచ్

ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడంపై వైభవ్ సూర్యవంశీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని రాజస్థాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ తెలిపాడు. వైభవ్ సూర్యవంశీకి ఫీల్డింగ్ కూడా చేయాలని ఉందని, కానీ టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తున్నామని వివరణ ఇచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 52, 31, 39, 78 విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా అతనిపై ఆధారపడి ఉంది.

వైభవ్ వైఫల్యంతో..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగ్గా.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. చివరకు ఈ మ్యాచ్‌లో 57 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

RR Coach Trevor Penny Reveals Why Teenage Sensation Vaibhav Sooryavanshi Was Unhappy with Impact Player Role Against SRH

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ కూడా చేసిన వైభవ్ సూర్య వంశీ గత రెండు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా బరిలోకి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్ సందర్భంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన ట్రెవర్ పెన్నీ.. వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

టీమ్ కాంబినేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాలని లేదని, ఫీల్డింగ్ కూడా చేయాలని ఉందని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడంపై అతను తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలిపాడు.

వైభవ్ సంతోషంగా లేడు..

'గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే అవకాశం రానందుకు వైభవ్ సూర్యవంశీ సంతోషంగా లేడు. ఎందుకంటే అతనికి ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. అతను అద్భుతమైన ఫీల్డర్. డోనోవన్ తన ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. SA20లో అతని కాలర్ బోన్ విరిగింది. అతను అద్భుతమైన ఫీల్డర్. అతను మళ్ళీ మైదానంలోకి రావడం సంతోషకరం. అతని రాకతో దురదృష్టవశాత్తూ వైభవ్ ఫీల్డింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది.'అని వివరణ ఇచ్చాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ నాలుగేసి వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్‌లోనే రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది.

SRH ఘన విజయం

కెప్టెన్ ఇషాన్ కిషన్(44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 40), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 28), సలీల్ అరోరా(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/37) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డోనవన్ ఫెరీరా(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69), రవీంద్ర జడేజా(32 బంతుల్లో 5 ఫోర్లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే(4/34), సకీబ్ హుస్సేన్(4/24) నాలుగేసి వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగా(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, April 14, 2026, 16:33 [IST]
Other articles published on Apr 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+