For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ గిల్ కంటే అతని స్ట్రైక్‌రేట్ ఎక్కువ: టీమిండియా మాజీ క్రికెటర్

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా చర్చ జరుగుతున్న క్రమంలో మాజీ క్రికెటర్ ఆర్‌పీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కంటే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ స్ట్రైక్‌రేట్ మెరుగ్గా ఉందని తెలిపాడు. టీ20 ఫార్మాట్‌లో ఫియర్‌లెస్ అప్రోచ్‌తో ఆడుతున్న భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ నైపుణ్యాన్ని నమ్ముకుంటుందా? లేక స్ట్రైక్‌రేట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? అనేది చూడాలని ఆర్‌పీ సింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మరికొద్ది గంటల్లో ఆసియా కప్ 2025 టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ జట్లు తలపడనున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 10) యూఏఈ‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఈ టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కాయి. దాంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాదిగా భారత టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్ దూరంగా ఉండటంతో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 3 శతకాలతో సత్తా చాటాడు.

RP Singh Says Strike rate of Shubman Gill hasn t been as great as Sanju Samson s ahead of Asia Cup 2025

శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో ఓపెనర్‌గా ఎవరు? ఆడుతారనేది చర్చనీయాంశమైంది.వైస్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడిస్తారనే సంకేతాలను టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చింది. ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన సంజూను మళ్లీ మిడిలార్డర్‌లో ఆడిస్తారా? లేక బెంచ్ పరిమితం చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే మరో వికెట్ కీపర్ జితేష్ శర్మకు లోయరార్డర్‌లో మెరుగైన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ కంటే శుభ్‌మన్ గిల్ స్ట్రైక్‌రేట్ చాలా తక్కువగా ఉందని ఆర్‌పీ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.

'బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియాకు మరో తలనొప్పి ఉంది. ఎందుకంటే వైస్ కెప్టెన్ అయిన శుభ్‌‌మన్ గిల్‌ను కచ్చితంగా ఆడించాలి. అతను ఐపీఎల్‌లో ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేయగల ఒక ఆటగాడు జట్టుకు అవసరం. అందుకు శుభ్‌మన్ గిల్ సరిగ్గా సరిపోతాడు. కానీ శుభ్‌మన్ గిల్ స్ట్రైక్ రేట్ (139.28) సంజూ శాంసన్ కంటే గొప్పగా లేదు. ఇది టీమిండియకు సవాలా? లేక శుభ్‌మన్ గిల్ నైపుణ్యాన్ని నమ్ముకొని బ్యాటింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేస్తారా? అనేది చూడాలి. అయితే స్ట్రైక్‌రేట్‌ మెరుగుపర్చుకునేందుకు శుభ్‌మన్ గిల్‌కు ఈ టోర్నీ మంచి అవకాశం ఉంది. నేను భారత టీ20 జట్టు గురించి మాత్రమే చర్చిస్తున్నాను. ఐపీఎల్‌లో మాత్రం శుభ్‌మన్ గిల్ మెరుగ్గా ఆడాడు," అని ఆర్‌పీ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 9, 2025, 15:34 [IST]
Other articles published on Sep 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+