జట్టు కంటే నీ ఇగో ముఖ్యమా? రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్లు ఫైర్!

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, ఆర్‌పీ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంత్ నిర్లక్ష్యంగా స్టంపౌటయ్యాడు. అనవసర షాట్‌కు ప్రయత్నించి పంజాబ్ కింగ్స్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. అయితే ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించినా.. పంత్ ఔటైన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆట తీరును ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన చోప్రా.. ఇగో తగ్గించుకోవాలని పంత్‌కు సూచించాడు.

పంత్ ఇగోకు పోయి..
'ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రిషబ్ పంత్ కంటే ముందు లలిత్ యాదవ్ ఎందుకు బ్యాటింగ్‌కి వచ్చాడు. పంత్, బ్యాటింగ్‌కు వస్తే పరుగుల వేగం పెంచేవాడు. లలిత్ యాదవ్ 24 బంతులాడి 21 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ వచ్చి ఓ సిక్సర్ కొట్టి, ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఇగో కారణంగా పంత్ వికెట్ చేజార్చుకున్నాడు. ఆ ఇగో తగ్గించుకోకపోతే అతను సక్సెస్ కాలేడు. లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టాలనే పంతంతో వికెట్ పారేసుకున్నాడు.

అక్షర్ చేసిన పరుగులతో..
అప్పటికే డేవిడ్ వార్నర్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అలాంటి ప్రారంభం దొరకడమంటే పంజాబ్ కింగ్స్‌కి లాటరీ తగిలినట్టే. అయితే సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడాడు. డిఫరెంట్ షాట్స్ ఆడుతూ చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. మిచెల్ మార్ష్ కూడా అదరగొట్టాడు. రోవ్‌మెన్ పావెల్ ఔటైనా అక్షర్ పటేల్ చేసిన పరుగులు చాలా అమూల్యమైనవి. అక్షర్ చేసిన 17 పరుగులే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తేడా.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

లివింగ్ స్టోన్ ట్రాప్‌లో..
టీమిండియా మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ సైతం రిషభ్ పంత్ ఔటైన తీరును తప్పుబట్టాడు. 'మ్యాచ్ గెలవడం కంటే ఈగో ముఖ్యమా? ఆప్పటికే పంజాబ్ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. లలిత్ యాదవ్‌ను నిందించలేము. ఎందుకంటే అతడికి అంత అనభవం లేదు. వికెట్లు పడుతున్న సమయంలో పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సింది. లివింగ్‌స్టోన్ ట్రాప్ చేశాడు. పంత్ అతడి ట్రాప్‌లో పడిపోయాడు. లివింగ్‌స్టోన్ రెగ్యూలర్ బౌలర్ కూడా కాదు. లివింగ్‌స్టోన్ తెలివిగా పంత్ టెంపర్‌కు తగ్గట్టు బౌలింగ్ చేశాడు. చివరికి అతని ఈగోపై లివింగ్‌స్టోన్ విజయం సాధించాడు' అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు.

చెలరేగిన శార్దూల్ ఠాకూర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సర్ఫరాజ్ ఖాన్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు తీయగా.. రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీలో శార్దూల్ (4/36) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు. అన్రిచ్ నోర్జ్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications