Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఆ ఐదుగురికి గుడ్‌బై.. ఆర్‌సీబీ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ దుమ్మురేపింది. అద్వితీయమైన ప్రదర్శనతో వరుసగా రెండో టైటిల్ అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి టైటిల్ అందుకోవడాని 18 ఏళ్లు నిరీక్షించిన ఆర్‌సీబీ.. వరుసగా రెండో టైటిల్ అందుకొని తమ అభిమానులకు డబుల్ బొనాంజా అందించింది.

ఐపీఎల్ 2027 సీజన్‌లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. ఈ క్రమంలోనే జట్టును మరింత బలోపేతం చేయడంపై రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి వారంలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఈ మినీ వేలానికి ముందు అవసరం లేని ఆటగాళ్లను వదిలేయనుంది. ముఖ్యంగా ఆర్‌సీబీ ఐదుగురి ఆటగాళ్ల‌కు గుడ్‌బై చెప్పనుంది.

Royal Challengers Bengaluru RCB Likely to Release These Five Players Ahead of the IPL 2027 Mini Auction

1. యశ్‌ దయాల్

అత్యాచారంతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న యశ్ దయాల్‌‌కు ఆర్‌సీబీ ఉద్వాసన పలకనుంది. ఈ కేసుల నేపథ్యంలోనే ఐపీఎల్ 2026 సీజన్‌కు యశ్ దయాల్‌ను దూరం పెట్టింది. దాంతో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 2025 సీజన్‌లో యశ్ దయాల్ అద్వితీయమైన ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ అనవసరమైన కేసులతో తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. యశ్ దయాల్ స్థానంలో బరిలోకి దిగిన రసిక్ దార్ సలామ్ సత్తా చాటడంతో యశ్ దయాల్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. క్రిమినల్ కేసుల నుంచి బయట పడితే తప్పా యశ్ దయాల్ కెరీర్ మళ్లీ గాడిన పడేలా లేదు.


2. జోష్ హేజిల్ వుడ్

ఐపీఎల్ 2027 సీజన్‌‌కు ఆర్‌సీబీ జోష్ హేజిల్ వుడ్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతను ఈ సీజన్‌కు దూరంగా ఉండనున్నాడని వార్తలు వచ్చాయి. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అతని వర్క్‌లోడ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మెగా టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడేందుకు అనుమతివ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వేలానికి ముందే హేజిల్‌ వుడ్‌ను వదిలేసి మరో ఓవర్‌సీస్ పేసర్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే హేజిల్ వుడ్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్‌సీబీకి జాకోబ్ డఫీ ఉన్నాడు.


3. మంగేష్ యాదవ్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఈ 24 ఏళ్ల లెఫ్మార్మ్ పేసర్‌ను ఆర్‌సీబీ రూ.5.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతనికి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి జట్టుకు అవసరమైన ఆటగాడిని తీసుకోవచ్చు. లేదంటే తక్కువ ధరకు అతన్ని తిరిగి కొనుగోలు చేయవచ్చు.

4. రొమారియో షెఫెర్డ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆల్‌రౌండర్‌గా.. ఫినిషర్‌గా సంచలన ప్రదర్శనలతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ వెస్టిండీస్ ప్లేయర్.. గత సీజన్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసాడు. ఇతర ఆటగాళ్ల ప్రదర్శనలతో ఆర్‌సీబీ గట్టెక్కినా.. రొమారియో చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్‌తో జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన రొమారియో షెఫెర్డ్ 20.75 సగటుతో 83 పరుగులే చేశాడు. ఇందులో 6 ఫోర్లతో పాటు 5 సిక్స్‌లు ఉన్నాయి. బౌలింగ్‌లో 11.92 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయాలనే యోచనలో ఆర్‌సీబీ ఉంది.

5. జోర్డాన్ కాక్స్

ఈ 26 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్‌ను ఆర్‌సీబీ రూ.75 లక్షలకు గత సీజన్ వేలంలో కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు. జట్టు కూర్పూలో భాగంగా ఈ రైట్ ఆర్మ్ బ్యాటర్‌కు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఆటగాడిని ఎంచుకోవచ్చు.

Story first published: Wednesday, August 5, 2026, 11:54 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+