
ఖతర్నాక్ ప్లేయర్సే టార్గెట్..
బలమైన జట్టును ఎంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్‌సీబీ.. గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఖతర్నాక్ విదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తుంది. నలుగు స్టార్ ఓవర్‌సీస్ ప్లేయర్లతో టీమ్ బిల్డప్ చేయాలనుకుంటుంది. ఇప్పటికే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల కోసం వ్యూహాలు రచిస్తుంది.
ప్లాన్ ఏ ప్రకారం వికెట్ కీపర్ ఆప్షన్స్‌గా బెయిర్ స్టో, డికాక్‌లను టార్గెట్ చేసిన బెంగళూరు.. బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా జాసన్ హోల్డర్/మిచెల్ మార్ష్‌లను తీసుకోవాలనుకుంటుంది. పేసర్లుగా ట్రెంట్ బౌల్ట్, రబడా, కమిన్స్‌లను ఎంచుకోవానుకుంటుంది. ప్లాన్ బి ప్రకారం డేవిడ్ వార్నర్, డేవాన్ కాన్వే, ఫినిషర్‌గా నికోలస్ పూరన్‌లను టార్గెట్ చేసింది.

ఓపెనర్లుగా డికాక్, వార్నర్, బెయిర్ స్టో
ఓపెనింగ్ స్లాట్‌లో హిట్టర్‌ను తీసుకోవాలనుకుంటున్న ఆర్‌సీబీ క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలను టార్గెట్ చేసింది. ఇందులో జానీ బెయిర్ స్టో, క్వింటన్ డికాక్ చిక్కితే ఆ జట్టుకు వికెట్ కీపర్ ఆప్షన్ కూడా తీరనుంది. ఇందులో డేవిడ్ వార్నర్‌ను ఆర్‌సీబీ ప్రధాన టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అతని కోసం రూ.15-17 కోట్లు చెల్లించేందుకు కూడా ఆర్‌సీబీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వార్నర్ జట్టులోకి వస్తే కెప్టెన్‌గా కూడా పనికొస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. వార్నర్ చేజారితే మాత్రం జానీ బెయిర్ స్టో, క్వింటన్ డికాక్‌ల కోసం ఆర్‌సీబీ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.

మిడిలార్డర్‌లో హోల్డర్, మార్ష్, కాన్వే, పూరన్
మిడిలార్డర్‌లో డేవాన్ కాన్వేతో పాటు నికోలస్ పూర్, జాసన్ హోల్డర్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లను టార్గెట్‌గా పెట్టుకుంది. బౌలింగ్ ఆల్‌రౌండర్లను తీసుకోవాలనుకుంటే జాసన్ హోల్డర్, మిచెల్ మార్ష్‌లను టార్గెట్ చేయనుంది. జాసన్ హోల్డర్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ఆర్‌సీబీ.. అతని కోసం రూ. 12 కోట్ల వరకు కూడా బిడ్ చేయనుందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. అతను చేజారితే మాత్రం మిచెల్ మార్ష్, విండీస్ ఆల్‌రౌండర్ రోమారియో షెఫార్డ్‌లను తీసుకోనుంది. ఇక ఓపెనర్లలో వికెట్ కీపర్ దొరకకుంటే.. నికోలస్ పూరన్‌ను తీసుకోనుంది. అతను ఫినిషర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కూడా రాణించగలడు.

పేసర్లుగా బౌల్ట్, కమిన్స్, రబడా
ఇక దేశవాళీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఉన్న నేపథ్యంలో ఆర్‌సీబీ ఓ ఖతర్నాక్ ఫారిన్ పేసర్‌ను తీసుకునే చాన్స్ ఎక్కువగా ఉంది. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు అయిన ప్యాట్ కమిన్స్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడాలలో ఒకరిని టార్గెట్ చేయనుంది. ఈ ముగ్గురు వేలంలో తమకు చిక్కకపోతే.. మార్కో జాన్సెన్, మార్క్ వుడ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, టైమల్ మిల్స్, రీసీ టోప్లీలలో ఒకరిని తీసుకునే చాన్స్ ఉంది. గత సీజన్‌లోనే పేసర్లకు బాగా ఖర్చు పెట్టిన ఆర్‌సీబీ మూల్యం చెల్లించుకుంది. ఎంతో నమ్ముకున్న కైల్ జెమీసన్, డానియల్ సామ్స్, రిచర్డ్‌సన్, డానియల్ క్రిస్టియన్ దారుణంగా విఫలమయ్యారు.


Click it and Unblock the Notifications












