RCB: బలమైన బ్యాటింగ్.. బలహీనమైన బౌలింగ్.. ఈ సారైనా కోహ్లీసేన టైటిల్ బెంగ తీరేనా?

హైదరాబాద్: 'ఈ ఏడాది కప్ కొట్టాల్సిందే'.. ప్రతి సీజన్ ఐపీఎల్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పెట్టకునే అంచనా ఇది. కానీ పుష్కరమైంది.. అయినా ఆర్‌సీబీ కప్ కొట్టలే..! వరల్డ్ సూపర్ స్టార్లు ఉన్నా.. టాప్ మోస్ట్ స్కిల్డ్ ప్లేయర్లు ప్రయత్నించినా.. ప్రతి ఏడాది ఎక్కడో తేడో కొడుతూనే ఉన్నది. ముచ్చటగా మూడుసార్లు ఫైనల్‌కు చేరినా.. టైటిల్ ఒడిసిపట్టుకోలేని దురదృష్టం బెంగళూరుది..! గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరి ఊరించినా.. ముందడగు వేయక ఊసురుమనిపించింది. ఇక గతాన్ని వదిలేస్తే.. కనీసం ఇప్పుడైనా ఆర్‌సీబీ తలరాత మారుతుందా..? అందని ద్రాక్షగా మిగిలిపోతున్న ఐపీఎల్ టైటిల్‌ను కింగ్ కోహ్లీ ముద్దాడుతాడా? 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న బెంగళూరు అభిమానుల కల నేరవేరుతుందా?
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. వరల్డ్ క్రికెట్‌లో టాప్ మోస్ట్ ప్లేయర్లు.. ఎదురుగా మొనగాళ్లలాంటి బౌలర్లు ఉన్నా.. వీళ్ల బ్యాటింగ్ ముందు దిగదుడుపే. అయితే ఈ లెక్క ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు మాత్రమే సరిపోతున్నది. కానీ ఐపీఎల్‌లో మాత్రం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ బెంగను ఈ జోడీ తీర్చలేకపోతున్నది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా.. ఇప్పటికీ ఆర్‌సీబీకీ ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది.
2009, 2011, 2016లో ఫైనల్ చేరినా.. టైటిల్‌ను ఒడిసిపట్టుకోలేకపోయింది. ఈ మూడు సీజన్లు మినహా.. లీగ్ మొత్తం ఆర్‌సీబీ పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఓడిన ప్రతిసారి బౌలింగ్‌పై నిందలు వేస్తూ వచ్చిన బెంగళూరు ఇప్పుడూ అదే బలహీనతతో కనిపిస్తున్నది. మరి ఈ సారైనా టైటిల్ కరువుతీర్చుకుంటుందో లేదో చూడాలి. ఓసారి ఆ జట్టు బలాలు, బలహీనతలపై ఓ లుక్కెద్దాం!

ఆర్‌సీబీ బలం..
ఆర్‌సీబీ బలం, బలగం మొత్తం కోహ్లీ, డివిలియర్స్ అన్నది సత్యం. టీమ్ మొత్తానికి ఈ ఇద్దరూ మూల స్తంభాలు. వ్యక్తిగతంగానూ ఐపీఎల్‌లో ఈ ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ఈ ఇద్దరూ నిలబడితే సిక్సర్ల జడివానలో పరుగుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు వీరికి అండగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ జతయ్యాడు. ఈ ముగ్గురూ తలుచుకుంటే ఎంతటి మ్యాచ్‌నైనా ప్రత్యర్థి నుంచి తేలికగా లాగేసుకుంటారు. ఈ త్రయానికి తోడు భారత డొమెస్టిక్ కుర్రాళ్లు దేవదత్ పడిక్కల్, మహ్మద్ అజారుద్దీన్ ఉన్నారు. వీరు వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే చాలు. ఫిన్ అలెన్, సచిన్ బేబీ, బిగ్ బాష్ స్టార్ డానియల్ క్రిస్టియన్ ఆ జట్టుకు అదనపు బలం. ఇక ఆల్‌రౌండర్లు డానియల్ సామ్స్, హర్షాపటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో లోయరార్డర్ కూడా బలంగానే ఉంది.

బలహీనత..
ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తుంటే బౌలింగ్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. గత సీజన్‌లో బౌలింగ్ విభాగాన్ని నడిపించిన క్రిస్ మోరిస్‌ను వదులుకొని ఆర్‌సీబీ ఎంత తప్పిదం చేసిందో ఆ జట్టుకు వేలంలో తెలిసొచ్చింది. అనుభవం కలిగిన బౌలర్లు లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. జట్టులోని ప్లేయర్లంతా టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడినా.. ఇతర జట్లతో పొలిస్తే ఐపీఎల్ అనుభవం చాలా తక్కువ. అత్యధిక ధర వెచ్చించిన కైల్ జెమీసన్, కేన్ రిచర్డ్సన్‌లతో పాటు భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీలే జట్టును నడిపించాల్సి ఉంది. డాన్ క్రిస్టియన్, డానియల్ సామ్స్ మంచి బౌలర్లే అయినప్పటికీ ఐపీఎల్ అనుభవం చాలా తక్కువ. ఇక గత సీజన్‌లో దారుణంగా విఫలమైన సైనీ ఏ మేరకు రాణిస్తాడో అనేది కూడా చూడాలి.
ఇక కోహ్లీ, డివిలియర్స్‌పై అతిగా ఆధారపడటం కూడా ఆ జట్టుకు నష్టం చేకూరుస్తుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ భారాన్ని మోసే ప్లేయర్ లేడు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో టాప్-3 విఫలమైతే ఇక ఆర్‌సీబీ కమ్ బ్యాక్ కావడం చాలా కస్టంగా కనిపిస్తున్నది. మరి ఈ సారైనా మ్యాక్స్‌వెల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చి బెంగళూరుకు అండగా నిలుస్తాడో లేదో చూడాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన విరాట్.. ఐపీఎల్‌లో మాత్రం తేలిపోతున్నాడు. టీమ్‌మేట్స్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో విఫలమవుతున్నాడు. కాబట్టి ఈసారి ఆ బలహీనతలను అధిగమించాలి.

ప్లే ఆఫ్స్ అంచనా..
పవర్‌పుల్ బ్యాటింగ్‌కు అండగా యువ ఆల్‌రౌండర్లు, బౌలర్లు అంచనాలకు తగ్గట్లు చెలరేగితే కచ్చితంగా ఆర్‌సీబీని టైటిల్ పోరులో చూడొచ్చు. బౌలింగ్ విభాగం రాణించేదానిపైనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుంధర్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. ఏప్రిల్ 9న జరిగే సీజన్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది.

ఆర్‌సీబీ టీమ్..
బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, పవన్ దేశ్‌పాండే, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, సచిన్ బేబీ,
కీపర్స్: ఏబీ డివిలియర్స్, మహ్మద్ అజారుద్దీన్, కేఎస్ భరత్, ఫిన్ అలెన్
ఆల్‌రౌండర్స్: గ్లేన్ మ్యాక్స్‌వెల్, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, హర్షల్ పటేల్, కైల్ జెమీసన్, డానియల్ క్రిస్టియన్, సయాష్ ప్రభు దేశాయ్
బౌలర్లు: మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్‌సన్, యుజ్వేంద్ర చాహల్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications