For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB IPL 2022 Schedule: ఫస్ట్ మ్యాచ్ ఎవరితో అంటే? టైమ్ టేబుల్, మ్యాచ్‌ల వివరాలు!

Royal Challengers Bangalore (RCB) IPL 2022 Schedule, Time Table, Match List, Venue Details Is Out

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ పేపర్‌పై బలంగానే కనిపిస్తోంది. సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇతర జట్ల కంటే మంచి టీమ్‌నే ఎంచుకుంది. హర్షల్ పటేల్, వానిందు హసరంగాలకు ఎక్కువ డబ్బులు తగలేయడం, విధ్వంసకర ఏబీడీని భర్తీ చేసే ఆటగాడిని తీసుకోకపోవడం తప్పితే మిగతా స్లాట్లను అద్భుతమైన ఆటగాళ్లతో నింపేసింది. దేశీయ స్టార్లపై ఎక్కువ నమ్మకం ఉంచింది.

కాకపోతే అనుభవలేమి అభిమానులను కంగారుపెడుతుందే తప్పా జట్టు అన్ని విధాలుగానే బాగానే ఉంది. గత 13 సీజన్లుగా బలహీనమైన బౌలింగ్‌‌తో నెట్టుకొచ్చిన ఆర్‌సీబీ.. ఈ సారి మాత్రం ఆ విభాగాన్ని పటిష్టంగా మార్చింది. కానీ బ్యాటింగ్‌ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది.

కెప్టెన్‌గా కార్తీక్..

కెప్టెన్‌గా కార్తీక్..

అనూహ్యంగా వెటరన్ ప్లేయర్స్ ఫాఫ్ డుప్లెసిస్‌, దినేశ్ కార్తీక్‌ను తీసుకున్న ఆర్‌సీబీ వారినే తమ జట్టుకు కెప్టెన్సీ ఆప్షన్స్‌గా భావిస్తోంది. గత సీజన్‌తోనే కెప్టెన్సీ బాధ్యతలను విరాట్ కోహ్లీ వదిలేయడంతో కొత్త సారథిని తీసుకోవాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా మెరుగైన విజయాలందించేందుకు కోహ్లీ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంతో ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొనసాగాలని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. కానీ అతను దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎంత బుజ్జగించినా విరాట్ వినలేదని సమాచారం. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఆర్‌సీబీ రెడీ అయినట్లు తెలుస్తోంది.

 పంజాబ్‌తో మొదలు..

పంజాబ్‌తో మొదలు..

ఫాఫ్ డుప్లెసిస్‌ ఉన్నప్పటికీ.. అతని ఫిట్‌నెస్ సమస్యగా మారనుంది. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్ చేద్దామంటే అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే కేకేఆర్‌ను నడిపించిన అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్ సరైనోడని ఆర్‌సీబీ భావిస్తోందంట. అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ అధివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ షెడ్యూల్ ప్రకారం ఆర్‌సీబీ తమ ఫస్ట్ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో మార్చి 27న ఆడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక చివరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వాంఖడే స్టేడియంలో మే 19న ఆడనుంది. గ్రూప్స్ ఫార్మాట్ నేపథ్యంలో ఆర్‌సీబీ ఈ సారి ముంబై ఇండియన్స్‌తో ఒకే ఒక్క మ్యాచ్ ఏప్రిల్ 9న ఆడనుంది.

 ఆర్‌సీబీ షెడ్యూల్ ఇదే..

ఆర్‌సీబీ షెడ్యూల్ ఇదే..

తేదీ మ్యాచ్ టైమ్ వేదిక
మార్చి 27 పీబీకేఎస్xఆర్‌సీబీ రాత్రి 7.30 గంటలకు డీవై పాటిల్ స్టేడియం
మార్చి 30 ఆర్‌సీxకేకేఆర్ రాత్రి 7.30 గంటలకు డీవై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 5 ఆర్‌ఆర్(రాజస్థాన్)xఆర్‌సీబీ రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 9 ఆర్‌సీబీxముంబై రాత్రి 7.30 గంటలకు పుణే
ఏప్రిల్ 12 సీఎస్‌కేxఆర్‌సీబీ రాత్రి 7.30 గంటలకు డీవైపాటిల్ స్టేడియం
ఏప్రిల్ 16 డీసీxఆర్‌సీబీ రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 19 ఎల్‌ఎస్‌జీxఆర్‌సీబీ రాత్రి 7.30 గంటలకు డీవై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 23 ఆర్‌సీబీ xసన్‌రైజర్స్ రాత్రి 7.30 గంటలకు బ్రాబోర్న్ స్టేడియం
ఏప్రిల్ 26 ఆర్‌సీబీ xఆర్‌ఆర్ రాత్రి 7.30 గంటలకు ఎంసీఏ స్టేడియం, పుణే
ఏప్రిల్ 30 గుజరాత్xఆర్‌సీబీ సాయంత్రం 3.30 గంటలకు బ్రాబోర్న్ స్టేడియం
మే 4 ఆర్‌సీబీXసీఎస్‌కే రాత్రి 7.30 గంటలకు ఎంసీఏ స్టేడియం, పుణే
మే 8 సన్‌రైజర్స్Xఆర్‌సీబీ సాయంత్రం 3.30 గంటలకు ఎంసీఏ స్టేడియం, పుణే
మే 13 ఆర్‌సీబీXపీబీకేఎస్ రాత్రి7.30 గంటలకు బ్రాబోర్న్ స్టేడియం
మే 19 ఆర్‌సీబీ X గుజరాత్ టైటాన్స్ రాత్రి 7.30 వాంఖడే స్టేడియం
Story first published: Monday, March 7, 2022, 14:56 [IST]
Other articles published on Mar 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+