Royal Challengers Bangalore హెడ్ కోచ్‌గా సంజయ్ బంగర్!

బెంగళూరు: ఐపీఎల్ 2022 టైటిలే లక్ష్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సిద్దమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణను మొదలు పెట్టిన ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌ను నియమించింది. తదుపరి రెండు సీజన్ల పాటు బంగరే కోచ్‌గా ఉంటాడని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సన్ బంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తనను హెడ్ కోచ్‌గా నియమించినందుకు బంగర్.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు. తదుపరి సీజన్ వేలానికి సంబంధించిన ప్లాన్స్‌ను కూడా బంగర్ అభిమానులతో పంచుకున్నాడు.

టైటిల్ గెలవడమే..
ఆర్‌సీబీకి అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ అందించేందుకు కృషి చేస్తానని చెప్పాడు. 'ఇంత పెద్ద ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు ఒక పెద్ద అవకాశం. నేను జట్టులోని అత్యంత అద్భుతమైన, ప్రతిభావంతులైన కొంతమంది సభ్యులతో కలిసి పనిచేశాను. ఈ బృందాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చేయాల్సింది చాలా ఉంది. కానీ, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌తో మేం బాగా పనిచేసి అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయిస్తాం' అని తెలిపాడు.

బ్యాటింగ్ కోచ్ నుంచి..
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్ బంగర్ బాధ్యతలు నిర్వర్విస్తున్నారు. అయితే ఐపీఎల్-2021 ఫస్టాఫ్‌లో ఆర్సీబీకి ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకండ్ ఫేజ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దాంతో డైరెక్టర్‌గా ఉన్నమైక్ హెస్సన్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించాడు. తాజాగా బంగర్‌కు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ ఇవ్వడంతో మైక్ హెస్సన్ ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో తదుపరి ఆర్‌సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా..
బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్‌కు అపారమైన అనుభవం ఉంది. 2014 నుంచి 2016 వరకు పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన సంజయ్ బంగర్.. 2014 నుంచి 2019 వరకు భారత బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు. 2019 ప్రపంచకప్ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయంపై చాలా వివాదం నెలకొంది. ఈ నిర్ణయం సంజయ్ బంగర్ దేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే అతనిపై వేటు వేసి విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించారు. సంజయ్ బంగర్ ఆల్‌రౌండర్‌గా భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 650 పరుగులు చేసి 14 వికెట్లు తీశాడు. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్‌లో, అతను ఫస్ట్ క్లాస్‌లో 300, లిస్ట్ ఏలో 92, టీ20లో 31 వికెట్లు తీశాడు. అతను ఐపీఎల్‌లో కూడా ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లలో భాగమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications