For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB Probable Squad For IPL 2022: బెంగళూరులోకి డేవిడ్ వార్నర్, నటరాజన్.. పూర్తి జట్టు ఇదే!

Royal Challengers Bangalore Probable Squad For IPL 2022: List OF Players Which RCB To Target In Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి. ఇక గత 13 సీజన్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వేలానికి అన్ని విధాలుగా సిద్దమవుతోంది.

సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో విరాట్ కోహ్లీ(రూ.15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)లను మాత్రమే తీసుకున్న ఆర్‌సీబీ రూ.33 కోట్లే ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లు ఉన్నాయి. ఓ రకంగా వేలంలో ఇది మంచి అమౌంటే.

అయితే ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఏబీడీ వంటి స్టార్ ప్లేయర్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో ఆర్‌సీబీ డేవిడ్ వార్నర్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్‌లను తీసుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో ఆర్‌సీబీ టార్గెట్ చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ స్లాట్ కోసం శిఖర్ ధావన్‌తో పాటు డేవిడ్ వార్నర్‌పై ఆర్‌సీబీ కన్నేసింది. డేవిడ్ వార్నర్ కోసం భారీ ధర వెచ్చిచ్చేందుకు కూడా ఆర్‌సీబీ సిద్దంగా ఉంది. వార్నర్‌ను తీసుకుంటే కెప్టెన్సీ లోటు కూడా తీరుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. శిఖర్ ధావన్ కోసం గట్టిగానే ప్రయత్నించాలనుకుంటుంది.

వార్నర్ దొరకకపోతే.. జానీ బెయిర్ స్టోలను తీసుకోవాలనుకుంటుంది. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గానే కొనసాగించాలనుకుంటే మరో ఓపెనర్‌‌ను తీసుకోకపోవచ్చు. బ్యాకప్ ఆప్షన్స్‌గా యువ ఆటగాళ్లను ఎంచుకునే చాన్సుంది.

మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మలాన్

మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మలాన్

ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌ను ఫస్ట్ టార్గెట్‌గా ఆర్‌సీబీ పెట్టుకుంది. డేవిడ్ వార్నర్ వేలంలో దొరకకపోతే.. అయ్యర్ కోసం రూ. 20 కోట్లు పెట్టడానికైనా ఆర్‌సీబీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా అయ్యర్ పనికొస్తాడని ఆ జట్టు భావిస్తోంది. అయితే అయ్యర్‌కు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో అతను దొరకకపోతే.. ఇషాన్ కిషన్ తీసుకోవాలనుకుంటుంది. అలాగే డేవిడ్ మలాన్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, నికోలస్ భరత్‌లను టార్గెట్ చేయాలనుకుంటుంది.

పేసర్లుగా కమిన్స్, రబడా

పేసర్లుగా కమిన్స్, రబడా

జట్టు పేసర్లుగా ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, నటరాజన్, క్రిస్ జోర్డాన్‌లను ఆర్‌సీబీ టార్గెట్‌గా పెట్టుకుంది. వేలానికి భారీ డబ్బే ఉండటంతో స్టార్ ప్లేయర్లకు ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తోంది. అయితే కమిన్స్, రబడా వంటి ఆటగాళ్లు రూ. 15 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది కాబట్టి భారత పేసర్లే ఆర్‌సీబీకి దక్కే చాన్సుంది.

నటరాజన్, ప్రసిధ్ క‌ృష్ణలను కొనుగోలు చేసే చాన్సుంది. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్‌ను మళ్లీ తీసుకునేందుకు ఓ మోస్తారు ధర వరకు ఆర్‌సీబీ ప్రయత్నించనుంది. రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుంధర్, నాథన్ లయన్ వంటి స్పిన్నర్లును బ్యాకప్ ఆప్షన్‌గా పెట్టుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు(అంచనా)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు(అంచనా)

డేవిడ్ వార్నర్/శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్/ నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, వానిందు హసరంగా, ప్యాట్ కమిన్స్/కగిసో రబడా/ మార్క్ వుడ్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్, మహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ప్రసిధ్ కృష్ణ, జగదీష్ సుచిత్, అశ్విన్ హెబ్బర్, తన్మయ్ అగర్వాల్, తిలక్ వర్మ

Story first published: Friday, February 4, 2022, 7:09 [IST]
Other articles published on Feb 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+