Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాను చూసి తప్పు చేశాం అనుకున్నా: వెస్టిండీస్ కెప్టెన్

తరౌబా: భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేయడంపై వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సంతోషం వ్యక్తం చేశాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడి విజయాన్నందుకున్నామని తెలిపాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ విజయానంతరం మాట్లాడిన రోవ్‌మన్ పావెల్.. టీమిండియా బౌలింగ్ లైనప్ చూసి పెద్ద తప్పు చేసానని భావించానన్నాడు. అదనపు స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం తమకు నష్టం చేస్తుందనుకున్నాని తెలిపాడు.

Rovman Powell says I thought we were a spinner short After watching the Indians bowl

'ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సిరీస్‌లో శుభారంభం చేయాలని ముందే అనుకున్నాం. అన్నట్లుగానే మా కుర్రాళ్లు విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో గెలుస్తామనే ముందే అనుకున్నా. భారత బ్యాటర్లు సెట్ కాకపోవడంతో ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్తుందని ఊహించాను.

భారత బౌలింగ్ చూసిన తర్వాత మాకు ఓ స్పిన్నర్ తక్కువయ్యాడనుకున్నా. కానీ పేసర్లు ఆ లోటు లేకుండా బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుంది. కొత్త బంతితో మాత్రమే పరుగులు వస్తాయి.

మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కొవడంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. లెఫ్టాండర్స్ నికోలస్ పూరన్,షిమ్రాన్ హెట్‌మైర్, కైల్ మేయర్స్ కీలకం కానున్నారు. కరేబియన్ గడ్డపై పరుగులు చేయడం కష్టం. కానీ ఒక్కసారి పరుగులు చేయడం మొదలుపెడితే అదే జోరు కొనసాగుతోంది. జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు'అని రోవ్‌మన్ పొవెల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. పేలవ బ్యాటింగ్‌తో 4 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఖంగు తిన్నది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది.

నికోలస్ పూరన్(41), రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, August 4, 2023, 13:38 [IST]
Other articles published on Aug 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+