Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క బంతికి 22 పరుగులు.. ఆర్‌సీబీ బ్యాటర్ విధ్వంసం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాటర్ రొమారియో షెపెర్డ్ దుమ్మురేపాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2025‌లో ఒకే బంతికి 20 పరుగులు రాబట్టాడు. ఈ టోర్నీలో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతున్న రొమారియో షెపెర్డ్.. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు.

అయితే ఈ మ్యాచ్‌ 15వ ఓవర్‌లో రొమారియో షెపెర్డ్ ఒకే బంతికి 22 పరుగులు రాబట్టాడు. ఒషానే థామస్ వేసిన ఈ ఓవర్ మూడో బంతి నోబాల్ అయ్యింది. అయితే రొమారియో షెపెర్డ్‌ ఈ బంతిని వదిలేసాడు. తర్వాతి బంతి‌ని వైడ్ వేయడంతో ఫ్రీ హిట్ కొనసాగిందింది. అనంతరం మరో నోబాల్ వేయగా.. రొమారియో షెపెర్డ్ డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్‌ బాదాడు. ఇది కూడా నోబాల్ కావడంతో మరో ఫ్రీ హిట్ లభించింది. ఈ బంతిని కూడా షెపెర్డ్ సిక్స్ కొట్టాడు. ఫ్రీహిట్‌ను సిక్సర్ తరలించి షెపెర్డ్ ఒక్క లీగల్ డెలివరీకి (0nb, 0Wd, 6nb, 6nb, 6) 22 పరుగులు పిండుకున్నాడు.

Romario Shepherd s Unbelievable 20 Runs in One Legal Ball During CPL 2025

అయితే ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఓటమి తప్పలేదు. రొమారియో షెపెర్డ్ రాణించినా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 203 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అకీమ్ అగస్టే(35 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) రాణించాడు.

14 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ఆర్‌సీబీ తరఫున రోమారియో షెపర్డ్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లోయరార్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన రొమారియో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ అందుకున్నాడు. యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే ఫాస్టెస్ట్ రికార్డ్ నమోదు చేశాడు.

Story first published: Wednesday, August 27, 2025, 17:22 [IST]
Other articles published on Aug 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+