టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే అనవసర వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్‌పై హిందూ సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆమె ఆ పోస్ట్‌ను తొలగించారు. అయినా నెటిజన్లు రితికా పోస్ట్ స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తూ జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు.
గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఉద్దేశించిన రితికా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'అందరి కళ్లు రఫాపైనే ఉన్నాయి'అనే ఫొటోను షేర్ చేసింది. అయితే హిందువులపై దాడి జరిగినప్పుడు స్పందించారా? అంటూ కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. కశ్మీర్ పండిట్లు, మణిపూర్‌లో హింసతో పాటు దేశంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా? అని రితికాను నిలదీస్తున్నారు.

కేవలం ట్రెండ్‌ను ఫాలో అవుతూ పోస్ట్‌లు చేయడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. రఫా నగరంపై జరుపుతున్న దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రితికా సజ్దే కూడా ఇన్‌స్టాలో రఫాకు మద్దతుగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ప్రముఖులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
సినీతారలు సమంత, త్రిష, మాళవికా మోహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువొత్తు, అమీ జాక్సన్, అలియా భట్, కరీనాకపూర్, ప్రియాంకా చోప్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, త్రిప్తి డిమ్రిలు సోషల్ మీడియా వేదికగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రితికా సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది.
ముఖ్యంగా రోహిత్ శర్మకు సంబంధించి అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై కూడా రితికా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసింది.