Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20 కేజీలు తగ్గిన రోహిత్ శర్మ.. డైట్ సీక్రెట్ ఇదే!

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే రీతిలో బరువు తగ్గాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే బరువు తగ్గడంపై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. సుమారు 20 కేజీల బరువు తగ్గాడు. దాంతో బొద్దుగా కనిపించే రోహిత్ శర్మ.. కరెంట్ తీగలా సన్నగా మారిపోయాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు.

అయితే బరువు తగ్గేందుకు రోహిత్ శర్మ అందరిలా కడుపు మాడ్చుకోలేదు. హాయిగా రోజుకి 7 పూటలు తింటూ బరువు తగ్గాడు. జంక్‌ఫుడ్‌‌‌ను పూర్తిగా మానేసిన రోహిత్.. ఫ్రైడ్ ఫుడ్‌, కార్బ్స్‌ను బాగా తగ్గించాడు. ముఖ్యంగా అధిక కాలరీలు ఉండే బిర్యానీ, ఫ్రైడ్ స్నాక్స్, బటర్ చికెన్‌తో పాటు తనకు ఎంతో ఇష్టమైన వడాపావ్‌‌ను పూర్తిగా పక్కనపెట్టాడు. బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌తో పాటు వర్కౌట్స్ చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. దాదాపు 95 కేజీల నుంచి 75 కిలోలకు తగ్గాడు.

Rohit Sharma s Stunning 20 Kg Weight Loss Diet Plan and Fitness Secrets Revealed

1. ఉదయం లేవగానే(7 గంటల సమయంలో) రోహిత్ 6 నానబెట్టిన బాదం పప్పులు, మొలకెత్తిన సలాడ్, తాజా జ్యూస్‌ను తీసుకున్నాడు. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్‌లు అందించి జీవక్రియ, శక్తి స్థాయిలను పెంచుతాయి.

2. ఉదయం 9.30 గంటల సమయంలో తాజా పండ్లతో కూడిన ఓట్‌మీల్, ఓ గ్లాస్ పాలు‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్నాడు. ఇవి శరీరానికి కావాల్సిన కాంప్లెక్స్ కార్బ్స్‌తో కాల్షియాన్ని అందిస్తాయి. అంతేకాకుండా అధిక కాలరీలను మించకుండా చేస్తాయి.

3. ఉదయం 11.30 గంటల సమయంలో పెరుగు, చిల్లా, కొబ్బరి నీళ్లు, సమతుల్యమైన ప్రొబయోటిక్స్, ప్రోటీన్‌ను తీసుకునేవాడు. ఇవి జీర్ణక్రియను మెరుగు పర్చుకోవడంతో పాటు వర్కౌట్స్ చేయడానికి గల శక్తిని ఇచ్చేవి.

4. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వెజిటేబుల్ కర్రీ, పప్పు, అన్నం, సలాడ్‌తో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనంగా తీసుకునేవాడు. ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ ఉండేలా చూసుకునేవాడు. ఇది అతనికి అధిక ఫ్యాట్ లేకుండా శక్తినిచ్చేది.

5. సాయంత్రం 4.30 గంటల సమయంలో డ్రైఫ్రూట్స్‌తో కూడిన ఫ్రూట్ స్మూతీని తీసుకునేవాడు. ఈ ఆహారం సహజమైన షుగర్‌తో పాటు మంచి ఫ్యాట్స్ అందించేది. అంతేకాకుండా ఈవ్‌నింగ్ ట్రైనింగ్‌కు కావాల్సిన శక్తిని అందించేది.

6. రాత్రి 7.30 గంటలకు తాజా కూరగాయలు, పులావ్, వెజిటేబుల్ సూప్, ప్రొటీన్‌తో డిన్నర్ పూర్తి చేసేవాడు. ఇది అతని మజిల్‌ను పునరుద్దరించడంతో పాటు కార్డియో సెషన్స్‌కు కావాల్సిన శక్తిని ఇచ్చేది.

7. రాత్రి 9.30 గంటల సమయంలో పడుకునే కాసేపు ముందు ఒక గ్లాస్ పాలు తాగేవాడు. ఇది అతని మజిల్ రికవరీకి ఉపయోగపడటంతో పాటు రాత్రి పూట ఆకలి కాకుండా ఉండేలా చేసేది.

Story first published: Wednesday, October 8, 2025, 14:49 [IST]
Other articles published on Oct 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+