For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌తో నా ఇద్దరు కొడుకులు.. రోహిత్ శర్మ తల్లి పోస్ట్ వైరల్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 విజయాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌తో ఉన్న ఫొటోను జత చేసింది.

విరాట్ కోహ్లీని తన రెండో కొడుకుగా అభివర్ణించిన రోహిత్ శర్మ తల్లి.. ఈ ఇద్దరిని టీ20 దిగ్గజాలుగా పేర్కొంది. శనివారం సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంయుక్తంగా గెలిచిన మొదటి ఐసీసీ టైటిల్ ఇదే.

Rohit Sharma s mother s Purnima shares son s picture with brother Virat Kohli goes viral

ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇండియన్ ఫ్లాగ్‌ను భుజాలపై వేసుకొని టీ20 ప్రపంచకప్ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలో రోహిత్ శర్మ భుజాలపై అతని కూతురు సమైరా కూడా ఉంది. ఈ ఫొటోనే పంచుకున్న రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా.. తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చింది.

'ప్రపంచకప్ ట్రోఫీతో టీ20 క్రికెట్ దిగ్గజాలు. రోహిత్ భుజాలపై అతని కూతురు.. వెనుకాల జాతీయ పతాకం, పక్కన అతని సోదరుడు'అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కు అటు రోహిత్.. ఇటు కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మ చెప్పినట్లు ఈ ఇద్దరూ సోదరులేనని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు టీమిండియాకు ప్రపంచకప్‌ అందించిన బ్రదర్స్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇస్తున్నారు.

సౌతాఫ్రికాతో ఫైనల్లో రోహిత్ శర్మ విఫలమవ్వగా.. విరాట్ కోహ్లీ(76) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఈ ప్రపంచకప్ విజయం నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ఇంతకు మించిన మంచి సమయం లేదని స్పష్టం చేశారు.

'భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 మ్యాచ్. నిజాయితీగా చెబుతున్నా ఈ ఫార్మాట్‌ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదించాను.

ఈ ఫార్మాట్‌తోనే టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను.'అని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 1, 2024, 19:41 [IST]
Other articles published on Jul 1, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+