Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనిలాంటి ఆటగాడిని నేను చూడలేదు: రోహిత్ శర్మ కోచ్

టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షాపై వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. పృథ్వీషా లాంటి ప్రతిభావంతమైన ఆటగాడిని తాను చూడలేదన్నాడు. తప్పుడు మార్గం ఎంచుకోవడంతోనే పృథ్వీ షా సక్సెస్ కాలేకపోయాడని దినేష్ లాడ్ అభిప్రాయపడ్డారు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతేవేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, నిలకడలేని ప్రదర్శన అతని కెరీర్‌ను దెబ్బతీసాయి.

స్కూల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టినప్పటి నుంచే పృథ్వీ షాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతని ఫియర్‌లెస్ గేమ్ చూసి మరో సెహ్వాగ్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేసారు. అందుకు తగ్గట్లునే పృథ్వీ షా దుమ్మురేపాడు. 17 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించాడు. ఆ తర్వాత అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి విజేతగా నిలబెట్టాడు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

Rohit Sharma s Childhood Coach Dinesh Lad Praises Indian Cricket s Position Criticizes Prithvi Shaw

అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ బాది తన రాకను ఘనంగా చాటుకున్నాడు. అతనికి తిరుగులేదని అంతా అనుకున్న సమయంలో గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. అనంతరం నిలకడలేమి ప్రదర్శన, ఫిట్‌నెస్ సమస్యలతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పృథ్వీ షా గురించి దినేష్ లాడ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'పృథ్వీ షా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను అతన్ని 10 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాను. నేను చూసిన అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడు పృథ్వీ షా. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా.. ప్రతీ ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. అతని ప్రయాణంలో ఏం జరిగిందో నాకు ఖచ్చితంగా తెలియదు. తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా అతను తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. కానీ పృథ్వీ షా ఇప్పటికీ ప్రతిభావంతమైన ఆటగాడేనని నేను నమ్ముతాను. భారత జట్టు టాపార్డర్‌లో అతనిలాంటి బ్యాటర్ ఉండాలనేది నా అభిప్రాయం. అతను బ్యాటింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం.’అని దినేష్ లాడ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం భారత క్రికెట్‌ అత్యున్నత స్థాయిలో ఉందని దినేష్ లాడ్ తెలిపారు. ప్రతిభావంతమైన ఆటగాళ్లకు లోటు లేదని చెప్పారు. 'వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు. కోచ్‌లుగా మేం స్టార్ ఆటగాళ్లను తయారు చేస్తున్నాం. తదుపరి ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు. కాబట్టి భారత క్రికెట్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది.'అని దినేష్ లాడ్ పేర్కొన్నారు.

Story first published: Tuesday, August 12, 2025, 8:42 [IST]
Other articles published on Aug 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+