Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింగిల్ కోసం 20 బంతులా? సిగ్గుండాలి.. ఇషాన్‌ కిషన్‌పై మండిపడ్డ రోహిత్! (వీడియో)

డొమినికా: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌‌ను మందలించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇషాన్ జిడ్డు బ్యాటింగ్‌ చూసి రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 'సింగిల్ తీయడానికి 20 బంతులా? సిగ్గుండాలి'అని ఆగ్రహంగా హవాభావాలిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే డిక్లెర్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. కానీ కెరీర్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్‌కు బ్యాటింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని కాసేపు వాయిదా వేసిది. ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవగానే డిక్లేర్ చేయాలనుకుంది. కానీ అతను మాత్రం సింగిల్ తీసేందుకు ఏకంగా 20 బంతులు ఆడాడు.

 Rohit Sharma

విండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. అతను సింగిల్ తీసిన వెంటనే డిక్లేర్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్‌పై కన్నెర్ర చేశాడు. సింగిల్ తీయడానికి 20 బంతులా? సిగ్గుండాలంటూ నోరుపారేసుకున్నాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అశ్విన్(5/60) ధాటికి 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్ 421/5 వద్ద డిక్లేర్ చేసింది.

యశస్వి (387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 171)‌, రోహిత్ శర్మ(103) సెంచరీలతో చెలరేగగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో విండీస్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యం నమోదవ్వగా.. ఆ జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్(7/71) ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, సిరాజ్ ఓ వికెట్ తీసారు.

Story first published: Saturday, July 15, 2023, 21:26 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+