హ్యాపీ బర్త్‌డే చహల్ భాయ్.. ఈ ఏడాదైనా జర లావుగా!

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నేడు(జూలై 23) 30వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు ఈ చలాకీ చహల్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానులు కూడా చహల్ సూపర్ రికార్డులను గుర్తుచేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆన్‌ఫీల్డ్‌లో తన ఆటతో.. ఆఫ్ ఫీల్డ్‌లో తన సయ్యాటతో అభిమానులను అలరించే చహల్.. ఈ ఏడాది మరిన్నీ వికెట్లు తీయాలని, మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ తమను ఎంటర్‌టైన్ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

హ్యాపీ బర్త్‌డే మిస్టర్ ఎలుకా..
‘యుజీ చహల్.. నేను నిన్ను మిస్టర్ ఎలుకా అని పిలువాలా? ఈ ఏడాదైనా నువ్వు జర లావు కావాలని కోరుకుంటున్నా. ఇలాగే నీ ఫన్నీ వీడియోలు, కామెంట్స్‌తో మమ్మల్ని అలరించాలి. ఈ ఏడాది నీవు మరింత సక్సెస్ సాధించాలి. హ్యాపీ బర్త్‌డే చహల్.'-యువరాజ్ సింగ్
భారత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ యుజ్వేంద్ర చహల్ ఇలాంటి జన్మదినాలు మళ్లీ మళ్లీ జరుపుకోవాలి-రోహిత్ శర్మ
‘హ్యాపీ బర్త్‌డే యుజీ బాయ్ చహల్, టాలెంట్ ఫోర్స్‌లో నీవు ఒకడవు. నీవు మరిన్నీ వికెట్లు తీయాలని, ఈ ఏడాదంతా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇలానే దూసుకెళ్లు'-సురేశ్ రైనా

చతుర్, చలాక్, చహల్..
‘చతుర్, చలాక్, చంచల్, చహల్.. హ్యాపీ బర్త్‌డే మై ఫ్రెండ్'-ఆకాశ్ చోప్రా
‘జన్మదిన శుభాకాంక్షలు చహల్.. ఆయురారోగ్యంతో ఈ ఏడాది నీకంతా మంచే జరగాలని, మరిన్నీ వికెట్లు తీయాలని కోరుకుంటున్నా'- మయాంక్ అగర్వాల్
‘హ్యాపీ బర్త్‌డే చహల్.. ఇలాంటి రోజులు నీ జీవితంలో మళ్లీ మళ్ల రావాలి. నీవు మరింత సక్సెస్ సాధించాలి'- వృద్ధిమాన్ సాహా
‘హ్యాపీ బర్త్‌డే చహల్.. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలి బ్రో'- కేఎల్ రాహుల్

భద్రంగా ఉండు బ్రదర్
‘హ్యాపీ బర్త్‌డే చహల్.. భద్రంగా ఉండు బ్రదర్'-దినేశ్ కార్తీక్
‘హ్యాపీ బర్త్‌డే చహల్.. నీ జీవితంలో చిందేసే క్షణాలు, అద్భుత రోజులు మళ్లీ మళ్లీ రావాలి. -భువనేశ్వర్ కుమార్
‘నా సోదరుడు చహల్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఇలానే అతను మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నా'-శిఖర్ ధావన్

తొలి భారత బౌలర్‌గా..
పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందిన చహల్.. ఈ ఫార్మాట్‌లో 5 వికెట్ల హాల్ అందుకున్న తొలి భారత బౌలర్ కూడా అతనే. ఇప్పటి వరకు భారత్ తరఫున 52 వన్డేలు, 42 టీ20లు ఆడిన చహల్.. 91, 55 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో కూడా ఈ చలాకీ లెగ్ స్పిన్నర్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన చహల్.. 100 వికెట్లు తీసాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్లు హాల్ అందుకున్నాడు.
ఇక కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన చహల్.. టిక్ టాక్ వీడియోలతో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అలాగే కోహ్లీ, రోహిత్, యువరాజ్, గేల్‌లను సరదా కామెంట్లతో ఆటపట్టిస్తూ వారితో చివాట్లు కూడా తిన్నాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ కోసం ఈ రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఎదురు చూస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో ఈ చలాకీ లెగ్ స్పిన్నర్ ఇరగదీయాలని, భారత జట్టు తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాలని ‘మైఖేల్ తెలుగు' కూడా మనస్పూర్తిగా కోరుకుంటూ చహల్ భాయ్‌కు విషెస్ తెలియజేస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications