అసలేం జరిగిందంటే..?
శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మహమ్మద్ షమీ వేయగా.. తొలి మూడు బంతులను ఆడిన షనక 2, 0,1తో మూడు పరుగులు చేశాడు. నాలుగో బంతికి టెయిలెండర్ కసున్ రజితా స్ట్రైకింగ్ రాగా.. 98 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్న షనక నాన్ స్ట్రైకర్‌లో ఉన్నాడు. సెంచరీ చేసుకోవడంపై ఫోకస్ పెట్టిన షనక.. సింగిల్ తీసివ్వాలని రజితకు సూచించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ భారత ఫీల్డర్లను సర్కిల్ లోపల పెట్టగా.. షమీ బంతి వేయక ముందే షనక క్రీజు ధాటాడు. ఇది గమనించిన షమీ.. మన్కడింగ్ పద్దతిలో రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. అంతలోనే కెప్టెన్ రోహిత్ శర్మ జోక్యం చేసుకోని షమీ చేత అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో ఆట కొనసాగగా.. స్ట్రైక్‌లోకి వచ్చిన షనక బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెహ్వాగ్ సెంచరీ మిస్ చేసినా..
సెంచరీ అనంతరం డసన్ షనకను ప్రత్యేకంగా రోహిత్ శర్మ అభినందించాడు. ఇక రోహిత్ శర్మ చూపించిన క్రీడా స్పూర్తిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. గతంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేయకుండా ఇదే శ్రీలంకకు చెందిన బౌలర్ నోబాల్ వేసి అడ్డుకుంటే.. రోహిత్ శర్మ మాత్రం డసన్ షనక పోరాటాన్ని గుర్తించి క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చివరి ఓవర్‌లో చోటు చేసుకున్న ఈ డ్రామా మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాడు.

పద్దతి కాదనే...
ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షమీ ఇలా మన్కడింగ్ చేస్తాడని ఊహించలేదన్నాడు. 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న షనకను ఇలా ఔట్ చేయడం సరికాదని భావించే అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నామని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు. షనక అసాధారణ బ్యాటింగ్ చేశాడని, అతని పోరాటానికి హ్యాట్సాఫ్ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 67 పరుగులతో శ్రీలంకను చిత్తు చేసింది.

శతక్కొట్టిన కోహ్లీ..
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. షనక(88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్భుత సెంచరీతో టీమిండియాను వణికించాడు.


Click it and Unblock the Notifications
