
నాలుగు ఆప్షన్స్..
ఆసియాకప్ 2022లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా.. అడ్వెంచర్ గేమ్ పేరిట గాయపడి జట్టుకు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని టాప్-4లో ఆడించడం జట్టుకు కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత అతని సేవలు కోల్పోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. అతని స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నా.. గుడ్డిగా అతన్ని జట్టులో ఆడించే పరిస్థితుల్లేవ్. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌ల్లో జడేజా లేని లోటు పూడ్చేందుకు ద్రవిడ్ అండ్ కో నాలుగు ఆప్షన్స్‌ను ప్రయత్నించనుంది.

ఆప్షన్-1: దీపక్ హుడా ఆడటం..
జడేజా స్థానంలో తుది జట్టులోకి బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడాను తీసుకోవడం టీమిండియా ముందున్న తొలి ఆప్షన్. దీపక్ హుడా నెంబర్ 7లో బ్యాటింగ్ చేస్తే.. హార్దిక్ పాండ్యా ఐదో బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆఫ్ స్పిన్నర్ అయిన హుడా బౌలింగ్ కూడా చేయగలడు. అంతేకాకుండా అతని చేరికతో టీమిండియా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరగనుంది. అయితే ఆసియాకప్‌లో హుడా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కాబట్టి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అవకాశం ఇస్తే సత్తా చాటాల్సి ఉంటుంది. హుడాను తీసుకోవడం వల్ల హార్దిక్‌పై భారం పడనుంది. నాలుగు ఓవర్లను పూర్తిగా వేయాల్సి ఉం టుంది.

ఆప్షన్ 2: అక్షర్ పటేల్..
జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడం టీమిండియా ముందున్న రెండో ఆప్షన్. అక్షర్ పటేల్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి అతను నాలుగు ఓవర్లు వేయగలడు. అప్పుడు హార్దిక్ పాండ్యా భారం తగ్గనుంది. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం జడేజాలా అక్షర్‌ను టాపార్డర్‌లో ఆడించలేం. లోయరార్డర్‌లో హిట్టింగ్ చేయగలడే తప్పా... నిలకడగా ఇన్నింగ్స్ ఆడటం పటేల్ నుంచి కాదు. అతని చేరికతో బౌలింగ్ బలం పెరిగినా.. బ్యాటింగ్ బలహీనంగా మారనుంది.

ఆప్షన్-3: అశ్విన్ ఆడించడం..
జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వడం టీమిండియాకు ఉన్న మూడో ఆప్షన్. అశ్విన్ జట్టులోకి వస్తే అతను ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. టాపార్డర్‌లో కూడా అశ్విన్‌తో ఆడించవచ్చు. ఆస్ట్రేలియా గడ్డపై అతని బౌలింగ్ కూడా కీలకం కానుంది. భువీ, హర్షల్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న నేపథ్యంలో అశ్విన్‌ను టాపార్డర్‌లో ఆడించినా పెద్ద నష్టం ఉండదు. కానీ డెత్ ఓవర్లలో పవర్ హిట్టింగ్ మిస్సయ్యే ప్రమాదం ఉంది.

ఆప్షన్-4: దినేశ్ కార్తీక్‌ను తీసుకోవడం..
జడేజా స్థానంలో దినేశ్ కార్తీక్‌ను తీసుకోవడం టీమిండియా ముందున్న నాలుగో ఆప్షన్. అయితే హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లు పూర్తి చేయగలిగినప్పుడే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. పంత్ టాపార్డర్‌లో ఆడితే కార్తీక్ ఫినిషర్‌గా సేవలందించనున్నాడు. ఈ ప్లాన్‌లో టీమిండియా బ్యాటింగ్ బలం పెరిగినా.. బౌలింగ్ బలహీనంగా మారనుంది. టీమిండియాకు ఐదు బౌలింగ్ ఆప్షన్సే ఉండనున్నాయి. ఈ నాలుగు ఆప్షన్స్‌ను రోహిత్ సేన అప్‌కమింగ్ సిరీస్‌ల్లో ప్రయోగించనుంది.


Click it and Unblock the Notifications
