Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమ్ముడిపై రోహిత్ ఆగ్రహం!(వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవకాశం దొరికినప్పుడల్లా రోహిత్.. కార్ డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తుంటాడు. అతి వేగంగా కారును నడపడం హిట్ మ్యాన్‌కు సరదా. గతంలో అతివేగంగా కారు నడిపిన రోహిత్ శర్మ పోలీసులు జరిమానా కూడా విధించారు.

రోహిత్ శర్మకు లంబోర్ఘిని ఉరుస్, బీఎమ్‌డబ్ల్యూ ఎమ్5, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, మెర్సిడెస్-బెంజ్ GLS, రేంజ్ రోవర్ HSE LWB, BMW X3, మెర్సిడెస్ GLS 400d, టయోటా ఫార్చ్యూనర్, స్కోడా లారా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. రోహిత్ శర్మ తన కార్లను చాలా అపురూపంగా చూసుకుంటాడు. చిన్న గీత పడినా తట్టుకోలేడు. కారుకు డెంట్ వేసిన తన తమ్ముడు విశాల్ శర్మపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rohit Sharma was irked at his brother for scratching his car at Wankhede

ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట ఓ కొత్త స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టాండ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మ‌లు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు రితికా సజ్దే, రోహిత్ సోదరుడు విశాల్ శర్మ, అతని సతీమణి కూడా హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో కారు వెనుక భాగంలో సొట్ట పడటం చూసిన రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. యే క్యా హై అంటూ తమ్ముడు విశాల్‌పై హిట్ మ్యాన్‌ మండిపడ్డాడు. రివ‌ర్స్ తీసుకునే స‌మ‌యంలో డెంట్ పడిన‌ట్లుందని విశాల్ చెప్పగా.. మరింత కోపానికి గురైన రోహిత్.. 'ఎవ‌రి వ‌ల్లా , నీ వ‌ల్లే ఇదంతా'జ‌రిగిదంటూ తమ్ముడిపై అసహనం వ్యక్తం చేశాడు. రోహిత్ శ‌ర్మ పేరెంట్స్ గురునాథ్‌, పూర్ణిమా శ‌ర్మ‌, భార్య రితికా స‌జ్దే కూడా అక్క‌డే ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైరల్ కాగా.. ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కార్ లవర్స్ ఎవరూ డెంట్స్‌ను సహించరని, రోహిత్ శర్మ కూడా అదే చేశాడని పేర్కొంటున్నారు.

కొన్నేళ్ల క్రితమే, రోహిత్ అభ్యర్థన మేరకు విశాల్ శర్మ హాస్పిటాలిటీ రంగంలోని తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్రికెట్ అకాడమీని చూసుకుంటున్నాడు. భారత్‌, సింగపూర్‌లో రోహిత్ శర్మ పేరిట ఉన్న క్రికెట్ అకాడమీలను పర్యవేక్షిస్తున్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మకు సంబంధించిన పలు వ్యాపారాలను కూడా నడిపిస్తున్నట్లు సమాచారం. విశాల్ శర్మ మీడియాకు దూరంగా ఉంటాడు. రోహిత్‌తో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాయి.

Story first published: Saturday, May 17, 2025, 14:32 [IST]
Other articles published on May 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+