ఆ రెండూ జరగాలి.. అందులో నేను ఆడాలి: రోహిత్

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020తో పాటు 2020 టీ20 ప్రపంచకప్ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ టోర్నీలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. ఎప్పుడు నిర్వహించాలో ఇటు బీసీసీఐ అటు ఐసీసీకి అర్ధం కావడం లేదు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ మాత్రం తాను ఈ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.

రెండు టోర్నీలు జరగాలి:
ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో రెండు ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏది జరుగుతుందోనని ఆశిస్తున్నారు అని ఓ అభిమాని అడగ్గా.. 'ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లో జరగాలని కోరుకుంటున్నా. ఆ రెండు టోర్నీల్లోనూ బరిలోకి దిగాలనుంది' అని రోహిత్ సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు.

డే/నైట్ మ్యాచ్ సవాల్ లాంటిది:
ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్ సవాల్ లాంటిదని రోహిత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ అక్కడ నాలుగు టెస్టులు ఆడనుంది. ఇందులో అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును పింక్ బాల్‌తో ఫ్లడ్‌లైట్లలో నిర్వహిస్తారు. ప్రపంచకప్‌పై ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మెగా టోర్నీ వాయిదా పడితే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ లీగ్‌పై ఆశలు రేపాడు. అన్ని అవకాశాల్ని, ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించాడు.

ధోనీ ఓ లెజెండ్:
ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జెసన్ రాయ్‌ల ఆటను చూడటాన్ని ఆస్వాదిస్తున్నానని రోహిత్ తెలిపాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ.. ‘లెజెండ్' అని ముక్తాయించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పమని కోరగా.. స్టార్ ఓపెనర్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దీంతో అభిమాని బిత్తరపోయాడు. ఇంతకు ఆ అభిమాని ఏమడిగాడంటే... 'Virat Kholi గురించి ఒక్క మాటలో చెప్పండి' అని అడగ్గా.. 'స్పెల్లింగ్ చెక్ చేస్కో' అని రోహిత్ పంచ్ వేసాడు.
పాంటింగ్ అంపైర్‌లా వ్యవహరించాడు.. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్‌లు పట్టగానే అతడే ఔటిచ్చేవాడు: భజ్జీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications