
దిగజారిన కోహ్లీ ర్యాంక్..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐదో ర్యాంకును కోల్పోయాడు. ఇంగ్లండ్ గడ్డపై వరుసగా విఫలమవ్వడంతో ఓ స్థానం దిగజారిన కింగ్ కోహ్లీ 766 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే పర్యటనలో దుమ్మురేపిన రోహిత్ శర్మ.. 773 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లీని వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని అందుకున్నాడు. విరాట్ కన్నా రోహిత్‌కు 7 రేటింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోఇద్దరూ మూడేసి మ్యాచ్‌లు ఆడగా.. రోహిత్ శర్మ 230 రన్స్ చేశాడు. కోహ్లీ మాత్రం 124 రన్స్‌కే పరిమితమయ్యాడు. ఇదే రోహిత్‌ను టాప్-5లో నిలబెట్టింది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంక్. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో నిలిచిన విరాట్.. గత కొన్నేళ్లుగా విఫలవుతూ.. టాప్-5లో చోటు కోల్పోయాడు. 2017 తర్వాత కోహ్లీ ఇంతలా దిగజారడం ఇదే తొలిసారి.

డబ్ల్యూటీసీ ప్రారంభానికి ముందు..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫస్ట్ ఎడిషన్ ప్రారంభానికి ముందు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా లేడు. 922 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 522 రేటింగ్ పాయింట్స్‌తో టాప్-60లో ఉన్నాడు.
అలాంటిది రోహిత్ శర్మ తనదైన పెర్ఫామెన్స్‌తో టాప్-10లోకి దూసుకురావడమే కాకుండా.. కెప్టెన్ కోహ్లీని సైతం వెనక్కునెట్టేసి టాప్-5లో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ అభిమానులను ఇదే కలవరపెడుతుంది. వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ.. ఎన్నడూ లేని విధంగా విఫలమవుతున్నాడు. తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో విరాట్ ఇంతలా ఎన్నడూ ఇబ్బంది పడలేదు.

గత రెండేళ్లుగా..
2011 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ.. ప్రతీ ఏడాది మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. 2011లో 22.44 సగటుతో పరుగులు చేసిన కోహ్లీ.. 2012లో 49.21, 2013లో 56, 2014లో 44.58, 2015లో 42.67, 2016లో 75.94, 2017లో 75.64, 2018లో 55.08, 2019లో 68.00 సగటుతో పరుగులు చేశాడు.
ఇక 2020లో యావత్ ప్రపంచాన్ని కరోనా కమ్మేయగా.. కోహ్లీ బ్యాట్ మూగబోయింది. ఆ ఏడాది కోహ్లీ కేవలం 19.33 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది 26.45 సగటుతో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు కోహ్లీ స్థాయి ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, జోరూట్, స్టీవ్ స్మిత్ ఈ రెండేళ్లలో దుమ్మురేపారు. రోహిత్ శర్మ సైతం అదరగొట్టాడు. 2019లో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్.. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.

సెంచరీ చేయక 21 నెలలు..
విరాట్ కోహ్లీ చివరి సారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్‌లో విరాట్ (136) శతకం బాదాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీ చేయలేదు. సెంచరీ లేకుండా 2020ని ముగించాడు. దాంతో అతని సెంచరీల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. 2008 నుంచి 2019 వరకు కోహ్లీ ప్రతీ ఏడాది కనీసం ఒక్క సెంచరైనా బాదాడు. కానీ 2020లో మూడు ఫార్మాట్లో కలిపి ఒక్క శతకం బాదలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ 70 ప్లస్ రన్స్ చేసినా.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

ఇంగ్లండ్‌లోనైనా..?
ఆ తర్వాత తన తొలి సంతానం కోసం మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చాడు. గత రెండేళ్లలో ఇప్పటి వరకు 11 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 34 సగటుతో 374 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 74. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఒక్క మ్యాచ్ ఆడిన కోహ్లీ 44, 13 పరుగులతో విఫలమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణిస్తాడని భావిస్తే 5 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.
కనీసం మిగతా రెండు మ్యాచ్‌ల్లోనైనా కోహ్లీ సెంచరీ సాధించాలని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రోహిత్ మాత్రం ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై భారీ సెంచరీ బాదాడు. లార్డ్స్ టెస్ట్‌లో 83 పరుగులు.. గత మ్యాచ్‌లో 59 పరుగులు చేశాడు. 2019లో ఓపెనర్‌గా అవతారమెత్తిన తర్వాత హిట్ మ్యాన్.. 3 సెంచరీలు.. ఒక డబుల్ సెంచరీ బాదాడు.


Click it and Unblock the Notifications
