Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit vs Virat మళ్లీ గొడవలు షురూ.. నీ కెప్టెన్సీల నేనేందిరా ఆడేది!

Rohit Sharma vs Virat Kohli: Both Doesnt Want To Play Under Each Other Captaincy Big Blow For India

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేధాలు మొదలయ్యాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే సందేహం కలుగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయని వార్తలు షికారు చేశాయి. మైదానంలోని వీరి ప్రవర్తన కూడా ఈ వాదనకు బలం చేకూర్చింది. ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా కనీసం ఒకరికొకరు చూసుకోకపోవడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటన సమయంలో రోహిత్ శర్మ గురించి తనకు తెలియదని విరాట్ మీడియా ముందు వ్యాఖ్యానించడం వీరి మధ్య గొడవలున్నాయని నమ్మేలా చేశాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనలో వీరిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారు. విరాట్ సైతం మైదానంలో రోహిత్ శర్మ సలహాలు కోరాడు. దాంతో ఈ ఇద్దరు మళ్లీ మంచి స్నేహితులయ్యారని అభిమానులంతా భావించారు.

చిచ్చు పెట్టిన బీసీసీఐ..

చిచ్చు పెట్టిన బీసీసీఐ..

టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు సన్నిహితంగానే ఉన్నారు. రోహిత్ శర్మ కోసమే విరాట్ కోహ్లీ తన టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇక మెగా టోర్నీ దారుణ వైఫల్యం అనంతరం విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోగా.. రోహిత్ సారథిగా న్యూజిలాండ్ టీ20 సిరీస్ ఆడాడు. ఆ వెంటనే రెండు టెస్ట్‌ల సిరీస్ నుంచి రోహిత్‌కు రెస్ట్ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడని కోహ్లీ సెకండ్ మ్యాచ్‌కు ఆడి సిరీస్ విజయాన్నందించారు. అయితే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందే బీసీసీఐ.. కోహ్లీకి షాకిచ్చింది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే విరాట్ కోహ్లీ అంగీకారం లేకుండా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమైంది.

కెప్టెన్సీ తప్పించడంపై..

కెప్టెన్సీ తప్పించడంపై..

ఈ నిర్ణయాన్ని చిన్న ట్వీట్‌తో సరిపెట్టిన బీసీసీఐ.. కోహ్లీని తప్పించడానికి గల కారణాలను వెల్లడించలేదు. రెండు రోజుల తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మీడియా ముందుకు వచ్చి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ అధికారులు భావించారని, దాంతోనే విరాట్‌ను తప్పించాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవద్దని తాను, సెలెక్షన్ కమిటీ రిక్వెస్ట్ చేసిందని, కానీ విరాట్ పట్టించుకోలేదని తెలిపాడు. ఇక టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడని స్పష్టం చేశాడు. అంతేకాకుండా కోహ్లీ లేకుండా రోహిత్ 2018 ఆసియా కప్ గెలిచాడని తెలిపాడు.

రోహిత్ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేక..

రోహిత్ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేక..

ఇక బీసీసీఐ నిర్ణయం పట్ల ఆగ్రహంతో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. కోహ్లీ చిన్నానాటి కోచ్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు. అయితే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. తన కూతురు వామికా ఫస్ట్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నానని బీసీసీఐకి సమాచారమిచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే జనవరి 11న వామికా ఫస్ట్ బర్త్‌డే జరగనుండగా.. సౌతాఫ్రికాతో చివరి టెస్ట్ కూడా జనవరి 11-15 వరకు జరగనుంది. ఈ టెస్ట్ తర్వాతే వామికా బర్త్‌డే సెలెబ్రేషన్స్ చేస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది.

రోహిత్ సైతం...

రోహిత్ సైతం...

ఉద్దేశపూర్వకంగానే విరాట్ వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు అర్థమవుతుంది. రోహిత్ శర్మపై ఉన్న కోపంతో అతని కెప్టెన్సీలో ఆడేందుకు విరాట్ కోహ్లీ ఇష్టపడటం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ సైతం మూడు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడని బీసీసీఐ పేర్కొంది. కానీ రోహిత్ కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకనే టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరే వరకు ఒకరికొకరు తలపడకుండా బీసీసీఐ ప్లాన్ చేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి రోహిత్, కోహ్లీ వ్యవహారం భారత క్రికెట్‌కు తీరని నష్టం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Tuesday, December 14, 2021, 11:43 [IST]
Other articles published on Dec 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+