Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యర్థులకు రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్‌!

Rohit Sharma Tweets More Double Tons Are Yet To Come in ODI format

మంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రత్యర్థులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. భవిష్యత్తులో తాను మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతానని చెప్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే దిగ్గజ ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కానీ రితీలో రోహిత్ శర్మ పలు రికార్డులను నెలకొల్పాడు. వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా, గతేడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, హిట్‌మ్యాన్‌ వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ డబుల్ సెంచరీ బాది ఆదివారానికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి.

మరిన్నీ డబుల్ సెంచరీలు..

ఈ సందర్భంగా అతని అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలు క్రీడా వార్త సంస్థలు ఈ సూపర్ ఇన్నింగ్స్‌ను నెమరు వేసుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా రోహిత్ ట్రిపుల్ సెంచరీ నాటి ఫొటోలు, సెలెబ్రేషన్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ కూడా రోహిత్ ట్రిపుల్ డబుల్‌ను గుర్తు చేసుకుంది. 'క్రికెట్‌లో చాలా మందికి తమ సిలబస్‌లో లేని వన్డే డబుల్‌ సెంచరీని శర్మాజీ కొడుకు మూడోసారి అందుకున్నాడు. హిట్‌మ్యాన్‌ శర్మ' అని క్యాప్షన్‌గా పేర్కొంటూ నాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. దీనికి స్పందించిన అతను తన బ్యాట్‌ నుంచి మరిన్ని ద్విశతకాలు రానున్నాయని నవ్వుతూ ఉన్న ఏమోజీతో బదులిచ్చాడు.

ఫ్లైయింగ్ కిస్‌తో..

ఫ్లైయింగ్ కిస్‌తో..

ఇక హిట్‌మ్యాన్‌ తొలిసారి 2013లో ఆస్ట్రేలియాపై (158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్స్‌లతో 209) పరుగులు చేశాడు. మరుసటి ఏడాదే శ్రీలంకపై వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) నమోదు చేశాడు. మరో మూడేళ్లకు అదే శ్రీలంక( 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 నాటౌట్‌)పై మూడో డబుల్‌ సెంచరీ చేశాడు. 2017 డిసెంబర్‌ 13న మొహాలిలో జరిగిన రెండో వన్డేలో ఈ ముచ్చటైన ఘనత సాధించాడు. అదే రోజు రోహిత్‌ పెళ్లి రోజు కావడంతో ఈ డబుల్ సెంచరీ అతనికి ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ డబుల్ సెంచరీ తర్వాత తన సతీమణి రితికా సజ్దేకు రోహిత్ ఇచ్చిన ఫ్లైయింగ్ కిస్ సీన్ ఇప్పటికి అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్ తన సతీమణికి మ్యారేజ్ డే గిష్ట్ అంకితమిస్తున్నట్లు రోహిత్ ప్రకటించాడు.

చివరి వరకు నాటౌట్‌గా..

చివరి వరకు నాటౌట్‌గా..

ఇక ఆదివారం ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న రోహిత్-రితికా ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నాడు. రితికతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న హిట్ మ్యాన్.. ఐదేళ్ల అనుబంధం ఇలాగే కొనసాగాలని, చివరి వరకూ నాటౌట్‌గా మిగిలిపోవాలని తాము అనుకుంటున్నామని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. రితికా కూడా రోహిత్ దిగిన సెల్ఫీని పంచుకుంటూ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న రోహిత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. మూడో టెస్ట్‌కు ముందు జట్టుతో కలవనున్నాడు.

Story first published: Monday, December 14, 2020, 15:09 [IST]
Other articles published on Dec 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+